Site icon NTV Telugu

Thank You: టీజర్ ముహూర్తం చెప్పిన అక్కినేని వారసుడు

Thankyou

Thankyou

అక్కినేని నాగ చైతన్య, రాశి ఖన్నా జంటగా విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘థాంక్యూ’. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు మరియు శిరీష్ కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 8 న రిలీజ్ కానుంది. ఇక ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా టీజర్ కు మేకర్స్ ముహూర్తం ఫిక్స్ చేశారు. మే 25 సాయంత్రం 5:04 గంటలకు టీజర్‌ను విడుదల చేస్తున్నట్లు ఒక పోస్టర్ ద్వారా వెల్లడించారు.

ఇక పోస్టర్ లో నాగ చైతన్య చాలా క్లాస్ గా కనిపిస్తున్నాడు. ఎప్పటినుంచో అభిమానులు ఈ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. కొత్త కథతో విక్రమ్ కె కుమార్ వస్తున్నట్లు వినికిడి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కాగా, ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్‌ను జరుపుకుంటోంది. మరి ఈ సినిమాతో నాగ చైతన్య ఎలాంటి విజయాన్ని అందుకోబోతున్నాడో చూడాలి.

Exit mobile version