Thank God Movie Banned in Kuwait: కొంతకాలం నుంచి బాలీవుడ్ టైం అస్సలు బాగాలేదనే చెప్పుకోవాలి. ఏ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ అవ్వట్లేదు. భారీ అంచనాల మధ్య వచ్చిన పెద్ద సినిమాలు కూడా బోల్తా కొట్టేశాయి. ఇది చాలదన్నట్టు.. బాయ్‌కాట్ ట్రెండ్ తెగ నడుస్తోంది. వచ్చిన ప్రతీ సినిమాని బాయ్‌కాట్ చేయాలంటూ, నెటిజన్లు నెట్టింట్లో ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో ‘బ్రహ్మాస్త్ర’ సినిమా కాస్త ఊరటనైతే ఇచ్చిందని చెప్పుకోవచ్చు. ఇంతలో మరో షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. అజయ్ దేవ్‌గణ్, సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రలో నటించిన ‘థాంక్ గాడ్’ సినిమాపై కువైట్ ప్రభుత్వం బ్యాన్ విధించింది.
ఇటీవల విడుదలైన ‘థాంక్ గాడ్’ సినిమా ట్రైలర్.. మత విశ్వాసాలను దెబ్బ తీసేలా ఉందని కారణం చూపుతూ అక్కడి సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలోనే అక్కడి ప్రభుత్వం ఈ సినిమాను నిషేధించింది. అభ్యంతరకరమైన సన్నివేశాలను తీసేస్తేనే, సినిమా విడుదలకి అనుమతిస్తానని తెలిపింది. మరి, ఈ డిమాండ్‌ని చిత్రబృందం స్వీకరిస్తుందా? లేదా? అనేది చూడాలి. కాగా.. ఫాంటసీ కామెడీగా తెరకెక్కిన ఈ సినిమాలో అజయ్ దేవ్‌గణ్ చిత్రగుప్తుడిగా నటించాడు. సిద్ధార్థ్ మల్హోత్రా, రకుల్ ప్రీత్ కీలక పాత్రలు పోషించారు. కారులో పోతున్నప్పుడు ఫోన్ మాట్లాడుతుండగా.. సిద్ధార్థ్‌కి యాక్సిడెంట్ అవుతుంది. దాంతో అతడు కోమాలోకి వెళ్లగా, అతని ఆత్మ యమలోకానికి వెళ్తుంది. అక్కడ చిత్రగుప్తుడు ఇతనితో ‘ద గేమ్ ఆఫ్ లైఫ్’ అనే ఆట ఆడుతాడు. అతని పాప-పుణ్యాల చిట్టా విప్పుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందన్న నేపథ్యంతోనే ఈ సినిమా సాగుతుంది.