Site icon NTV Telugu

Thandel: భలే డేట్ పట్టేసిన మేకర్స్

Essence Of Thandel

Essence Of Thandel

Thandel is confirmed for a December 20th release: గత కొంతకాలంగా నాగచైతన్య సాలిడ్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. ప్రస్తుతం ఆయన అందులో భాగంగానే చందు మొండేటి దర్శకత్వంలో ఒక రియల్ లైఫ్ స్టోరీ తండేల్ చేస్తున్నాడు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన కొందరు మత్స్యకారులు గుజరాత్ తీరంలో చేపల వేటకు వెళ్లి ఇంటర్నేషనల్ బోర్డర్స్ దాటడంతో పాకిస్తాన్ నేవీ చేతుల్లో చిక్కి అనేక రోజులు జైలు శిక్ష అనుభవించారు. ఈ ఘటనను ఆధారం చేసుకుని ఒక లవ్ స్టోరీ రాసుకున్నారు. అందులో హీరోగా నాగచైతన్య నటిస్తుంటే హీరోయిన్గా సాయి పల్లవి నటిస్తోంది. పలు ఆసక్తికరమైన చిత్రాలు డైరెక్ట్ చేసిన చందు మొండేటి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని గీత ఆర్ట్స్ బ్యానర్ మీద బన్నీ వాసు నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్నారు. ఈ సినిమాను పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.

Bharatyeedu 2 : సిద్దార్థ్ కు బర్త్ విషెస్ చెప్పిన చిత్ర యూనిట్.. పోస్టర్ వైరల్..

ఇప్పుడు తాజాగా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ సినిమాని డిసెంబర్ 20వ తేదీన రిలీజ్ చేయబోతున్నట్లుగా టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి ఈరోజు ఉదయమే నితిన్ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమా డిసెంబర్ 20వ తేదీని రిలీజ్ చేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో అదే రోజున తండేల్ సినిమాని కూడా రిలీజ్ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి అదే నెలలో వచ్చిన పుష్ప 2021లో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక 20న రిలీజ్ చేస్తే క్రిస్మస్ వీకెండ్ కూడా కలిసి వస్తుందని మేకర్స్ ఈమేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు అధికారిక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశం ఉంది.

Exit mobile version