Site icon NTV Telugu

Thandel: ఏమైంది రా.. అప్డేట్ ఏదిరా.. ?

Chy

Chy

Thandel: టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా కార్తికేయ 2 ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం తండేల్. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై బన్నీ వాసు నిర్మిస్తున్నాడు. తండేల్ అంటే గుజరాతీలో పడవ ఆపరేటర్ అని అర్థం. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఎసెన్స్ ఆఫ్ తండేల్‌ ను నేడు రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ రెండు రోజుల క్రితమే తెలిపారు. మొదట ఈరోజు సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ, దాన్ని 7 గంటలకు మార్చారు. ఇక 7 దాటి రెండు గంటలు అవుతున్నా కూడా తండేల్ అప్డేట్ ను ఇచ్చింది లేదు. అసలు తండేల్ అప్డేట్ ఎందుకు ఇవ్వలేదు అని చెప్పి అభిమానులు మేకర్స్ పై ఫైర్ అవుతున్నారు.

ఇక తాజాగా మేకర్స్ ఎసెన్స్ ఆఫ్ తండేల్‌ వాయిదా పడినట్లు తెలుపుతూ అప్డేట్ ఇచ్చారు. ఊహించని సాంకేతిక సమస్యల కారణంగా ఎసెన్స్ ఆఫ్ తండేల్‌ ఈరోజు రిలీజ్ చేయడం లేదు. స్టన్నింగ్ గ్లింప్స్ రేపు రిలీజ్ చేస్తున్నట్లు తెలిపారు. ఇక దీంతో ఏమైంది రా.. అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇకపోతే ఈ చిత్రంలో చై.. తండేల్ రాజుగా నటిస్తున్నాడు. చైతన్య కెరీర్లోనే హైయెస్ట్ బడ్జెట్‌తో ఈ చిత్రం తెరకెక్కుతోంది. మరి ఈ సినిమాతో చై ఎలాంటి హిట్ ను అందుకుంటాడో చూడాలి.

Exit mobile version