అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మూవీ తండేల్. ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అందుకు తగ్గట్టే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. సూపర్ హిట్ మౌత్ టాక్ తో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రేక్షకులు థియేటర్లకు క్యూ కట్టడంతో హౌజ్‌ఫుల్ బోర్డులు పడ్డాయి. బుక్‌మై షోలో 24 గంటల్లో సుమారు 2 లక్షలకు పైగా టికెట్స్ అమ్ముడయ్యాయి.
Also Read : Tribanadhari : త్రిబాణధారి బార్భరిక్ నుంచి సిద్ శ్రీరామ్ సాంగ్ రిలీజ్..
దీంతో తండేల్ తొలిరోజు వసూళ్లు భారీగా నమోదు కావడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. అందుకు తగ్గట్టే ఫస్ట్ డే నాగ చైతన్య కెరీర్‌లోనే హైయెస్ట్ కలెక్షన్స్ రాబట్టింది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా రూ. 21 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు వచ్చినట్టుగా మేకర్స్ పోస్టర్ రిలీజ్ చేశారు. అటు ఓవర్సీస్‌లో తండేల్ తాండవం చేస్తోంది. USAలో తండేల్ మొదటి రోజు 400K డాలర్స్ వాసులు చేసిందని అధికారకంగా పోస్టర్ రిలీజ్ చేశారు. మొత్తంగా తండేల్ నాగ చైతన్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ రాబట్టిన చిత్రంగా నిలిచింది. ఈ సినిమాలో చైతూ, సాయి పల్లవి జోడీకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ముఖ్యంగా నాగ చైతన్య నటనకు అటు ఫ్యాన్స్ ఇటు క్రిటిక్స్ నుండి ప్రశంసల వర్షం కురుస్తోంది. కొన్ని సీన్లలో సాయి పల్లవిని సైతం డామినేట్ చేసినట్టుగా చెబుతున్నారు. చందూ మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పించగా బన్నీ వాస్ నిర్మించారు.