యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి హైలీ యాంటిసిపేటెడ్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయి సూపర్ హిట్ టాక్ తో పాటు బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ రాబట్టింది. ముఖ్యంగా నాగ చైతన్య నటనకు అటు క్రిటిక్స్ నుండి ఇటు సినిమా ప్రేక్షకుల నుండి అద్భుత స్పందన లభిచింది.
Also Read : NTRNeel : ఉప్పాడ బీచ్ లో ప్రశాంత్ నీల్.. ఎందుకోసమంటే.?
ఈ సినిమాతో అక్కినేని అభిమానులకు అందని ద్రాక్షలా మిగిలిన వంద కోట్ల గ్రాస్ ఆశను నెరవేర్చాడు నాగ చైతన్య. రిలీజ్ అయిన మొదటి వారానికి ఈ సినిమా వంద కోట్ల గ్రాస్ మార్క్ ను దాటింది. కాగా ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ దక్కించుకుంది. నాగ చైతన్య కెరీర్ లోనే భారీ ధరకు తండేల్ డిజిటల్ రైట్స్ ను కొనుగోలు చేసినట్టు సమాచారం. థియేటర్స్ లో రిలీజ్ అయిన నాలుగు వారాల తర్వాత మాత్రమే డిజిటల్ స్ట్రీమింగ్ చేసేలా ఒప్పందం చేశారట తండేల్ మేకర్స్. తాజాగా తండేల్ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయినట్టు సమాచారం. మార్చి 7 న నెట్ ఫ్లిక్స్ లో తండేల్ ను డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది. త్వరలో అఫీషియల్ గా డేట్ ను ప్రకటించనుంది నెట్ ఫ్లిక్స్. థియేటర్స్ లో మెప్పించిన తండేల్ ఓటీటీ ఏ మేరకు మెప్పిస్తుందో చూడాలి.