తెలుగు సినిమాటిక్ మ్యూజిక్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న థమన్ ఎస్ ఇప్పుడు టాప్ మోస్ట్ సంగీత దర్శకుల్లో ఒకరిగా నిలిచారు. తన మ్యూజిక్, పాటలతో ప్రత్యేక మార్క్ సెట్ చేసిన థమన్, ఇటీవల పలు సినిమాలకు మరింత పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ అందుకుంటున్నాడు. కెరీర్‌లో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా, థమన్ వెనక్కి తగ్గలేదు. చాలాసార్లు కొన్ని హీరోల అభిమానులు సోషల్ మీడియాలో తమ హీరో సినిమాకు “థమన్ వద్దు, అనిరుద్ కావాలి” అని ట్రెండ్ చేశారు. ఇది కొంతమంది వరకు అవమానకరంగా అనిపించినా, థమన్ తన పని ద్వారా నిరూపించి చూపించాడు.
Also Read :Tanushree Dutta : మగాళ్లతో ఒకే బెడ్‌పై పడుకోవాలి.. బిగ్ బాస్‌పై నటి తనుశ్రీ దత్తా షాకింగ్ కామెంట్స్
గతంలో, సూపర్ స్టార్ మహేష్ బాబుతో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాకు అతడు అందించిన మ్యూజిక్ ఆల్బమ్ మహేష్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌లలో ఒకటిగా నిలిచింది. తాజాగా, పవన్ కళ్యాణ్ హీరోగా ఓజీ కోసం చేసిన సంగీతం ద్వారా మరోసారి తనకంటూ క్లాస్ సెట్టింగ్ చేశాడు. ప్రతి సాంగ్ వింటున్న పవన్ అభిమానులు కదలిపోకుండా ఉంటున్నారు. ఈ అద్భుతమైన పనితీరు వలన, “థమన్ వద్దు, అనిరుద్ కావాలి” అంటూ ట్వీట్ చేసినవారూ కూడా ఇప్పుడు థమన్ వర్క్‌ను ప్రశంసిస్తున్నారు. ఈ విధంగా థమన్ ఇప్పుడు టాలీవుడ్‌లో మ్యూజిక్ టాప్ లీగ్‌లో దూసుకెళ్తున్నాడు. మన గెలుపే ఎదుటి వారికి సమాధానం అవుతుంది అనడానికి ఇది సింపుల్ ఎగ్జామ్ పుల్ అని చెప్పవచ్చు. మొత్తానికి తమన్ పట్టువదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్నాడు.
