Thaman : తెలుగులో థమన్ బ్యాక్ ఆన్ ట్రాక్

Thaman

Thaman

నందమూరి తమన్‌లో కంపోజరే కాదు.. డ్యాన్సర్ కూడా ఉన్నాడు. ఇటీవల ఇట్లు అర్జున సాంగ్ లాంచ్ ఈవెంట్లో హీరోయిన్‌ అనశ్వర రాజన్‌తో కలిసి స్టెప్పులేశాడు. ఈ మధ్య కాలంలో ఇంత జోష్ థమన్‌లో కనిపించలేదంటూ సెటైర్స్ పేలుస్తున్నారు నెటిజన్స్. అలాగే ఆదర్శ కుటుంబం ఆర్ ఆర్ కూడా ఫినీష్ అయిపోందని అందుకే చిల్ అవుతున్నాడని కామెంట్స్ వినిపించాయి.

థమన్ రీసెంట్లీ మ్యూజికల్ గ్రాఫ్ డౌన్ అయ్యింది. గత ఏడాదొచ్చిన ఓజీ నుండి ఇటీవల వచ్చిన లెనిన్ వరకు నో హిట్. వరుసగా తెలుగులో డిజాస్టర్స్ చూశాడు. లెనిన్ అతడ్ని మళ్లీ ట్రాక్ ఎక్కించింది. ఆ సక్సెస్ పరంపరను కొరియన్ కనకరాజ్‌తో కంటిన్యూ చేశాడు. నెక్ట్స్ హ్యాట్రిక్ ప్లాన్ చేస్తున్నాడు థమన్. అయితే ఇట్లు అర్జునతోనా, ఆదర్శ కుటుంబంతోనా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఆదర్శ కుటుంబం మూవీ వాయిదా పడటానికి తమన్ బీజీఎం కంప్లీట్ చేయలేదన్న రూమర్స్ నడిచాయి. థమన్ ప్లేసులో జీవీ ప్రకాష్‌తో కొట్టిస్తున్నారన్న బజ్ నడిచింది. కానీ వాటిని పటాపంచలు చేస్తూ అక్టోబర్ 30న సినిమా వస్తుందని రివీల్ చేశాడు థమన్.. ఆ తర్వాత ఎడిట్ చేసి డేట్ హైడ్ చేశాడు. కానీ ఇదే నెలలో వస్తుందని మాత్రం కచ్చితంగా చెబుతున్నాడు. అక్టోబర్ 30న ఏకే 47 వస్తే.. అదే డేట్‌పై కర్చీఫ్ వేసిన ఇట్లు అర్జున టీమ్ ప్రమోషన్స్ పీక్స్‌కు తీసుకెళుతోంది. మరి థమన్ హ్యాట్రిక్ ఏ సినిమాతో సిద్ధం చేశాడో వెయిట్ అండ్ వాచ్.