Site icon NTV Telugu

Vijay’s Wife Sangeetha: విజయ్ భార్య సంగీత గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు..

Vijay Wife

Vijay Wife

Vijay’s Wife Sangeetha: తమిళ స్టార్ దళపతి విజయ్ భార్య సంగీత స్వర్ణలింగం విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. విజయ్‌తో విడిపోవాలని భావిస్తున్నట్లు, విజయ్‌కి వేరే సినీ నటితో ఎఫైర్ ఉందని డైవర్స్ పిటిషన్‌లో పేర్కొనడం సంచలనంగా మారింది. చెంగల్పట్టు కోర్టులో ఈ మేరకు ఆమె డైవర్స్‌ కోసం అఫ్లై చేశారు. ఏప్రిల్ 20న విజయ్ తమ ముందు హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఈ అంశం తమిళనాడుతో పాటు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు టీవీకే పార్టీని పెట్టి, రాష్ట్రంలో అధికారంలోకి రావాలని విజయ్ భావిస్తు్న్న తరుణంలో భార్య నుంచి షాక్ తగిలింది.

సంగీత ఎవరు.?

సంగీత, విజయ్‌లకు 1999లో వివాహం జరిగింది. వీరిద్దరికి ఒక కుమారుడు జాసన్ సంజయ్, కుమార్తె దివ్య షాషా ఉన్నారు. 26 ఏళ్ల వైవాహిక జీవితానికి సంగీత ముగింపు పలకాలని భావించారు. తన భర్త విజయ్ స్టార్ హీరో అయినప్పటికీ, సంగీత మాత్రం లో ప్రొఫైల్ కొనసాగించారు. ఎక్కువగా బహిరంగం కార్యక్రమాల్లు, మీడియాలో కనిపించలేదు.

సంగీత యూకేలో పుట్టి పెరిగారు. ప్రస్తుతం ఆమె అక్కడే ఉన్నారు. ఆమె కుటుంబం శ్రీలంక తమిళ మూలాలని చెందినది. సంగీత తండ్రి యూకేలో తమిళ పారిశ్రామికవేత్త.

విజయ్‌తో తొలి పరిచయం:

పూవే ఉనక్కగా(1996) సినిమా సూపర్ హిట్ తర్వాత విజయ్‌కు తమిళనాడులో స్టార్ స్టేటస్ పెరిగింది. ఆ సమయంలో లండన్‌లో ఉన్న సంగీత, తన అభిమాన నటుడు విజయ్‌ను కలవడానికి చెన్నై వచ్చారు. ఈ సినిమా సక్సెస్‌పై సంగీత విజయ్‌ను అభినందించడానికి వెళ్లారు. ఆమె అభిమానం, ముక్కసూటి ప్రవర్తన నచ్చిన విజయ్ ఆమెను తన ఇంటికి ఆహ్వానించి తన తల్లిదండ్రులకు పరిచయం చేశారని పలు నివేదికలు చెబుతున్నాయి.

ఆ తర్వాత రెండు కుటుంబాల మధ్య సన్నిహిత సంబంధాలు పెరిగాయి. క్రమం తప్పకుండా విజయ్, సంగీతలు కలుసుకోవడం ప్రారంభించారు. ఇద్దరి మధ్య ప్రేమ చిగురించడంతో, ఇరు కుటుంబాల సమ్మతితో వివాహం చేసుకున్నారు. సంగీత హిందూ కుటుంబానికి, విజయ్ క్రైస్తవ కుటుంబానికి చెందిన వారైనప్పటికీ, వీరిద్దరి పెళ్లి హిందూ సంప్రదాయంలోనే జరిగింది. పెళ్లి తర్వాత చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించారు.

కుటుంబానికే ప్రాధాన్యత:

తమిళనాడుతో విపరీతమైన క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నప్పటికీ సంగీత తక్కువగా బహిరంగ కార్యక్రమాల్లో కనిపించేవారు. పెద్దగా మీడియా ముందుకు వచ్చేవారు కాదు. ఎక్కువగా కుటుంబానికి, పిల్లలకే ప్రాధాన్యత ఇచ్చారు. జాసన్, దివ్యలను ఈ వెండితెర వెలుగులకు దూరంగా పెంచారు. అప్పడప్పుడు మాత్రమే సంగీత బహిరంగంగా కనిపించేవారు. ఇప్పుడు విజయ్, సంగీతలు విడిపోవాలని నిర్ణయించుకోవడం ఆయన ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.

Exit mobile version