Site icon NTV Telugu

Thalapathy Vijay: లాస్ట్ మూవీ అనౌన్స్మెంట్ వచ్చేస్తోంది…

Vijay

Vijay

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ ప్రస్తుతం లోకేష్ కానగరాజ్ డైరెక్షన్ లో ‘లియో’ సినిమా చేస్తున్నాడు. గ్యాంగ్ స్టర్ డ్రామాగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే కంప్లీట్ అయ్యింది. అక్టోబర్ లోనే రిలీజ్ ఉండడంతో లియో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతున్నాయి. లియో తర్వాత విజయ్-వెంకట్ ప్రభుతో చేస్తున్నాడు. క్రియేటివ్ గా కథ చెప్పడం, కథనంలో కావాల్సినన్ని ట్విస్ట్ లు పెట్టడం వెంకట్ ప్రభు స్టైల్ అఫ్ ఫిల్మ్ మేకింగ్. రీసెంట్ గా కూడా ఆల్మోస్ట్ కెరీర్ అయిపొయింది అనుకున్న హీరో శింబుకి ‘మానాడు’ సినిమాతో సాలిడ్ కంబ్యాక్ హిట్ ఇచ్చాడు వెంకట్ ప్రభు. ఇప్పుడు ఏకంగా విజయ్ లాంటి స్టార్ హీరో పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు అంటే చిన్న విషయం కాదు. దళపతి 68 అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీ గురించి వెంకట్ ప్రభు సోషల్ మీడియాలో ఇంటరెస్టింగ్ ట్వీట్ చేసాడు. తన ప్రతి సినిమాకి ఒక కొత్త టైపు కొటేషన్ పెట్టే వెంకట్ ప్రభు, విజయ్ సినిమాకి ఎలాంటి కొటేషన్ ఉంటుందో రేపు రివీల్ చేస్తున్నట్లు ట్వీట్ చేసాడు.

వెంకట్ ప్రభు పాలిటిక్స్, వెంకట్ ప్రభు రీయూనియన్, వెంకట్ ప్రభు గేమ్ లాగా ఈసారి ఎలాంటి కొటేషన్ తో సినిమా చేస్తాడు అనేది చూడాలి. ఇదిలా ఉంటే ఇదే విజయ్ లాస్ట్ సినిమా అనే టాక్ వినిపిస్తోంది, వెంకట్ ప్రభు సినిమా అయిపోగానే విజయ్ పాలిటిక్స్ లో బిజీ అవ్వనున్నాడని సమాచారం. ఇందుకోసం సినిమాల నుంచి బ్రేక్ తీసుకోబోతున్నాడట. లియో అయిపోయాకే బ్రేక్ తీసుకుందాం అనుకున్న విజయ్ ని వెంకట్ ప్రభు సినిమా కోసం ఆల్మోస్ట్ 200 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చి ఒప్పించారట. ఒకవేళ ఇది నిజమైనా సినిమా బడ్జట్ 300 కోట్ల వరకూ ఉంటే అంత భారీ బడ్జట్ సినిమాని కూడా వెంకట్ ప్రభు హ్యాండిల్ చేయగలడా లేదా అనేది ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే వెంకట్ ప్రభు భారీ బడ్జట్ సినిమాలని చెయ్యడు, కథలో ట్విస్ట్ లతో గేమ్ ప్లే చేస్తాడు. మరి ఏ విషయంలో డేర్ చేసి ఈ ప్రాజెక్ట్ ని ఆన్ చేస్తున్నారో చూడాలి.

Exit mobile version