NTV Telugu Site icon

Vijay: నా కొడుకుతో నాకు విభేదాలు నిజమే.. ఓపెన్ అయిన విజయ్ తండ్రి

Viajy

Viajy

Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుస సినిమాలు చేస్తూ కోట్లు గడిస్తున్నాడు. ఇక సినిమాల విషయం పక్కన పెడితే.. విజయ్ కు, ఆయన తండ్రి చంద్ర శేఖర్ కు మధ్య విబేధాలు ఉన్నట్లు ఎప్పటినుంచో పుకార్లు వస్తున్న విషయం తెల్సిందే. విజయ్ కు తెలియకుండా చంద్రశేఖర్.. ఆయన పేరు మీద రాజకీయ పార్టీ పేరుతో ఆఫీస్ పెట్టడం నచ్చని విజయ్.. సొంత తండ్రి మీదనే పోలీస్ కేసు పెట్టాడు. అప్పట్లో ఈ విషయం పెద్ద సంచలనాన్నే సృష్టించింది. ఈ విబేధాల గురించి ఇప్పటివరకు తండ్రి కొడుకుల ఒక్కసారి కూడా నోరు మెదపలేదు. ఇక తాజాగా మొట్ట మొదటి సారి విజయ్ తండ్రి చంద్రశేఖర్ తమ విబేధాల గురించి ఓపెన్ అయ్యాడు. తమ మధ్య విబేధాలు ఉన్నాయని, కొడుకు విజయ్ కు తనకు మధ్య మాటలు లేవని చెప్పుకొచ్చాడు.

Pawan Kalyan: పవన్ అలాంటి సినిమా తీస్తే అభిమానులకు నచ్చుతుందా..?

ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. “ప్రతి తండ్రి కొడుకుల మధ్య ఉన్నట్లే మా ఇద్దరి మధ్య కూడా ఉన్నాయి. ఇప్పుడైతే మా మధ్య మాటల్లేవ్.. కానీ, అవేమి పెద్ద గొడవలు కావు. ప్రతి ఇంట్లో ఉండేవే.. వాటిని పెద్దవి చేసి చూపించకండి. చిన్న గొడవలు పడడం, మాట్లాడుకోకుండా మానేయడం, మళ్లీ కలుసుకోవడం మా మధ్య ఉన్నాయి. అంతెందుకు విజయ్ వారిసు సినిమా మేము ఇద్దరం కలిసే చూసాం. ఈ ఒక్కటి చాలదా మా మధ్య అనుబంధం ఎలా ఉందో చెప్పడానికి.. మా ఇద్దరికీ ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు ఉన్నాయి.మీడియా అనుకునేంత పెద్ద తగాదాలు మాత్రం మా మధ్య లేవు” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. ఇకపోతే విజయ్ కెరీర్ విషయానికొస్తే ఈమధ్యనే వారిసు తో మంచి విజయాన్ని అందుకున్న విజయ్.. ఇప్పుడు లోకేష్ కనగరాజ్ తో ఇంకో సినిమా చేయబోతున్నాడు.

Show comments