VIJAY : తమిళనాడు సీఎం విజయ్ – భార్య సంగీతను కలిపేందుకు ప్రయత్నాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గత కొంతకాలంగా కోలీవుడ్ స్టార్ హీరో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్, భార్య సంగీత విడిగా ఉంటున్న సంగతి తెలిసిందే. విజయ్ రాజకీయాల్లోకి ప్రవేశించిన సమయంలో విడాకులు కావాలని కోర్టు మెట్లెక్కింది. తమిళ్ స్టార్ హీరోయిన్ త్రిష కారణంగానే విజయ్ – సంగీత విడాకులు తీసుకుంటున్నారని అక్కడి మీడియా కోడై కూసింది. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయ్ పార్టీ గెలవడం సీఎం కావడం చక చక జరిగాయి. ఇక నెక్ట్స్ త్రిషని పెళ్లి కూడా చేసుకోబుతున్నాడని కూడా వార్తలు హల్ చల్ చేశాయి.
అయితే ఇప్పుడు వీటన్నింటికీ చెక్ పెడుతూ విజయ్, భార్య సంగీతను మళ్లీ కలపడానికి కుటుంబ సభ్యులు తెరవెనుక గట్టి ప్రయత్నాలే చేసినట్లు తాజా సమాచారం. విజయ్ రాజకీయాల్లో బిజీగా ఉన్న ఈ తరుణంలో వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లు పార్టీ ఇమేజ్‌పై ఎఫెక్ట్ పడకుండా ఉండేలా ఫ్యామిలీ మెంబర్స్ అలర్ట్ అయ్యారట. విజయ్, సంగీత మధ్య ఉన్న మనస్పర్థలను తొలగించి వారిద్దరినీ మళ్లీ ఒకటి చేయడానికి పెద్దలు చొరవ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఇరుపక్షాల మధ్య చర్చలు సఫలమయ్యాయని వీరిద్దరి మధ్య ఉన్న విబేధాలన్నీ దాదాపు పరిష్కారమయ్యాయని కోలీవుడ్ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. ఈ క్రేజీ స్టార్ జంటను తిరిగి ఒకటి చేయడంలో విజయ్ తల్లి శోభా చంద్రశేఖర్ అత్యంత కీలక పాత్ర పోషించారని తమిళనాడు పొలిటికల్ మరియు సినీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. తల్లిగా చొరవ తీసుకుని కోడలు సంగీతతో మాట్లాడి ఇద్దరినీ కూర్చోబెట్టి నచ్చజెప్పడంతో గొడవలు సద్దుమణిగినట్టు తెలుస్తోంది. విజయ్ తండ్రి ఎస్.ఎ. చంద్రశేఖర్‌తో గతంలో ఉన్న విబేధాలు కూడా ఇప్పుడు సమసిపోవడానికి ఈ పరిణామాలే కారణమని టాక్. త్వరలోనే విజయ్, సంగీత ఇద్దరూ కలిసి పబ్లిక్‌గా కనిపించి ఈ రూమర్లకు పూర్తిగా ఎండ్ కార్డ్ వేయబోతున్నట్లు సమాచారం.
Also Read
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
- Vijay Deverakonda : తగ్గేదే లే.. దసరా బరిలోనే రణబాలి! షూట్‌కి ప్యాకప్ చెప్పిన రౌడీ హీరో..
తాజావార్తలు
-
Disha Salian Case: ‘‘ఆమె ఎవరో నాకు తెలియదు’’.. దిశా కేసుపై ఆదిత్య ఠాక్రే కామెంట్స్..
-
Sangareddy: వినాయక నిమజ్జనంలో అపశృతి.. 6 మంది విద్యార్థులు మృతి
-
CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్‌లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
-
Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్‌పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
-
Actor Sridevi: నటి శ్రీదేవి ఆస్తి వివాదంపై సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!