సంక్రాంతి సీజన్ వచ్చిందంటే స్టార్ హీరోల సినిమాలు థియేటర్ దగ్గర క్యు కడతాయి. ప్రతి ఏడాది లాగే వచ్చే సంక్రాంతికి కూడా భారి సినిమాలు ప్రేక్షకులని అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. దాదాపు పది రోజుల పండగ సీజన్ ని కాష్ చేసుకోవడానికి నాలుగు పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘వాల్తేరు వీరయ్య’, ఇంకొకటి బాలయ్య నటించిన ‘వీర సింహా రెడ్డి’, మూడోది దళపతి విజయ్ నటించిన ‘వారసుడు’/’వారిసు’, నాలుగోది తల అజిత్ నటించిన ‘తునివు’/’తెగింపు’. ఈ నాలుగు సినిమాల్లో ‘వీర సింహా రెడ్డి’, ‘వారసుడు’ చిత్రాలు జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానున్నాయి. ‘వాల్తేరు వీరయ్య’ జనవరి 13న రిలీజ్ కానుంది, అజిత్ ‘తెగింపు’ జనవరి 11న విడుదల కానుంది.
‘వీర సింహా రెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’, ‘వారసుడు’ సినిమాల ప్రమోషన్స్ ఇప్పటికే మంచి స్వింగ్ లో జరుగుతున్నాయి. మేకర్స్ ఈ మూడు సినిమాల నుంచి పోస్టర్స్ అండ్ సాంగ్స్ ని రిలీజ్ చేసి మంచి బజ్ ని క్రియేట్ చేస్తున్నారు. అజిత్ ‘తెగింపు’ సినిమా ప్రమోషన్స్ మాత్రం చాలా వీక్ గా ఉన్నాయి. నిజానికి వీక్ కాదు పూర్తిగా సైలెంట్ గా ఉన్నాయనే చెప్పాలి. ‘తునివు’ నుంచి ఇప్పటికే రెండు పాటలు వచ్చి అజిత్ ఫాన్స్ ని ఖుషి చేస్తున్నాయి కానీ తెలుగులో ఒక్క పాట కూడా రిలీజ్ కాలేదు. తునివు మేకర్స్ అసలు ‘తెగింపు’ ప్రమోషన్స్ ని పూర్తిగా పక్కన పెట్టేసారనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లో ‘తెగింపు’ డిస్ట్రిబ్యూటర్స్ ని అనౌన్స్ చేస్తూ ‘జీ స్టూడియోస్’ ట్వీట్ చేసింది. కనీసం ‘తెగింపు’ సినిమాని తెలుగులో రిలీజ్ చేస్తున్న ‘రాధాకృష్ణ’, ‘ఇవీ ప్రొడక్షన్స్’ అయినా కాస్త ప్రమోషన్స్ విషయంలో కేర్ తీసుకుంటారేమో చూడాలి.
Proud to announce our Andhra Pradesh and Telangana distributor @Radhakrishnaen9 @IVYProductions9 #ThunivuPongal #Thunivu #NoGutsNoGlory#Ajithkumar #HVinoth@boneykapoor @bayviewprojoffl @kalaignartv_off @netflixindia #RomeoPictures @mynameisraahul @sureshchandraa @nirav_dop pic.twitter.com/r07R94QKZp
— Zee Studios (@ZeeStudios_) December 21, 2022
