Site icon NTV Telugu

అజిత్ కి ప్రేమ, ద్వేషం రెండూ కావాలట!

Thala Ajith Shares Special Message With His Fans As He Completes 30 Years In The Industry

‘ప్రొఫెషనల్’ అన్న పదానికి నిలువెత్తు నిదర్శనం తమిళ హీరో అజిత్. చాలా సందర్భాల్లో తన విలక్షణత చాటుకున్న ఈ టాలెంటెడ్ హీరో కోట్లాది మంది ఫ్యాన్స్ కి దేవుడు. అదే రేంజ్లో అజిత్ ని ట్రోల్ చేసే హేటర్స్ కూడా ఉంటారు. ఇతర హీరోల ఫ్యాన్స్, మరికొందరు, ఇలా అనేక మంది. అయితే, తమిళనాడులో అజిత్ ని మెచ్చుకునే వారు, తిట్టేవారు అందరూ ఉంటారు కానీ… పట్టించుకోకుండా ఉండగలిగేవారు ఎవ్వరూ ఉండరు! అటువంటి టాప్ స్టార్ తల…

అజిత్ ఈ రోజున ఉన్న స్థితికి ఊరికే రాలేదు. 30 ఏళ్ల కష్టం, పట్టుదల ఉన్నాయి. అందుకే, ఆయన కోలీవుడ్ లో తాను ప్రవేశించి మూడు దశాబ్దాలు పూర్తైన సందర్భంగా స్పెషల్ మెసేజ్ ఇచ్చాడు, ‘అందరికీ’! అవును, అజిత్ 30 ఇయర్స్ మెసేజ్ కేవలం ఆయన ఫ్యాన్స్ కే కాదు. ప్రతీ ఒక్కరికి…

Read Also : రివ్యూ: క్షీరసాగర మథనం

ఇంతకీ, అజిత్ ఏమన్నాడంటే… “ఫ్యాన్స్, హేటర్స్, న్యూట్రల్స్… ఒకే నాణానికి మూడు ముఖాల్లాంటి వారు! ఫ్యాన్స్ పంచే ప్రేమని, పడని వారు పంచే పగని, మధ్యస్థంగా ఉండేవారి అభిప్రాయాల్ని నేను ఆదరంగా స్వీకరిస్తాను! లివ్ అండ్ లెట్ లివ్! అన్ కండిషనల్ లవ్ ఆల్వేస్… ” అంటూ తన మ్యానేజర్ ద్వారా సందేశాన్ని సొషల్ మీడియాలో షేర్ చేయించాడు. ప్రస్తుతం ఆన్ లైన్లో అందరూ దీని గురించే చర్చించుకుంటున్నారు. ఫ్యాన్స్ నే కాక హేటర్స్ ని కూడా యాక్సెప్ట్ చేయటం అజిత్ కే చెల్లిందంటున్నారు! తల అజిత్ నెక్ట్స్ ‘వలిమై’ సినిమాలో కనిపించబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన మోషన్ పోస్టర్, ఫస్ట్ లిరికల్ దుమారం రేపుతున్నాయి. సినిమా విడుదల కోసం అజిత్ డై హార్డ్ ఫ్యాన్స్ ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్నారు…

Exit mobile version