కోలీవుడ్ లో సూపర్ స్టార్ రేంజ్ ఇమేజ్ ఉన్న స్టార్ హీరో తల అజిత్. స్టార్ అండ్ పర్ఫెక్ట్ యాక్టర్ గా పేరున్న అజిత్… తన లుక్ విషయంలో పెద్దగా కేర్ తీసుకోకుండా సినిమాలు చేస్తూ ఉంటాడు. కనీసం హెయిర్ కి కలర్ కూడా వేయకుండా న్యాచురల్ గా స్క్రీన్ పైన కనిపించడం అజిత్ స్టైల్. ఫ్యాన్స్ మాత్రం అప్పుడప్పుడు అజిత్ ని కాస్త స్లిమ్ గా చూడాలి అనుకుంటూ ఉంటారు. యాంటీ ఫ్యాన్స్ కూడా ఈ విషయంలో అజిత్ ని సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇతర హీరోలు ఫిట్ గా ఉంటే సాలిడ్ ఫ్యాన్ బేస్ ఉన్న అజిత్ మాత్రం అసలు ఫిట్నెస్ పైన దృష్టి పెట్టడు అంటూ కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. ఈ కామెంట్స్ కి బ్రేక్ వేసిన సినిమా వివేకం. శివ డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ మూవీలో అజిత్ సిక్స్ ప్యాక్ తో కనిపించి కోలీవుడ్ మూవీ లవర్స్ కి ఆశ్చర్యపరిచాడు.
ఆ తర్వాత అజిత్ మళ్లీ తన రెగ్యులర్ ఫిజిక్ లోకి వచ్చేసి ఫిట్నెస్ ని వదిలేసాడు. అయితే మరోసారి అజిత్ ని స్లిమ్ అండ్ ఫిట్ గా చూడబోతున్నారు అనే మాటలు కోలీవుడ్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. అజిత్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా విడ ముయార్చి ప్రస్తుతం అజర్‌బైజాన్ లో షూటింగ్ జరుపుకుంటుంది. మజిల్ తిరుమేణి డైరెక్ట్ చేస్తున్న ఈ యాక్షన్ సినిమా కోసం అజిత్ లావు తగ్గాడు. అజర్‌బైజాన్ నుంచి అజిత్ కొత్త ఫోటోలు బయటకి వచ్చి సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. సాల్ట్ అండ్ పెప్పర్ లుక్ లో అజిత్ చాలా స్టైలిష్ గా కనిపిస్తున్నాడు. దీంతో అజిత్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లోకి వచ్చి ‘తల’, అజిత్, విడ ముయార్చి ట్యాగ్స్ ని ట్రెండ్ చేస్తున్నారు. మే 1న విడ ముయార్చి సినిమా రిలీజ్ కానుంది, మరి ఈ మూవీతో అజిత్ ఎలాంటి హిట్ అందుకుంటాడు అనేది చూడాలి.
