NTV Telugu Site icon

Ajith: భార్యను వదిలి అజిత్ సీక్రెట్ ఎఫైర్.. ఎవరామె ?

Ajith

Ajith

Ajith: సినిమా ఒక రంగుల ప్రపంచం. ఇక్కడ ఉన్నవి లేనట్టు.. లేనివి ఉన్నట్లు సృష్టించడం సాధారణమే. అందులో నిజం ఉన్నా.. లేకున్నా.. బయటివారికి మాత్రం నిజమే అన్నట్లు కనిపిస్తూ ఉంటుంది. ఇక సోషల్ మీడియా వచ్చాకా అది ఇంకొంచెం ఎక్కువ అయ్యింది. ఎక్కడ ఏ చిన్న తప్పు కనిపించినా దాన్నీ బూతద్దంలో చూపించి పెద్ద సెన్సేషన్ చేస్తున్నారు. ఇంకొందరు లైక్స్ కోసం, పేరు కోసం నోటికి ఏది వస్తే దాన్ని ట్వీట్స్ రూపంలో రాసి ప్రజల మీదకు వదులి విమర్శల పాలవుతున్నారు. ఇలాంటి వారిలో ముఖ్యుడు ఉమైర్ సంధు. గత కొన్ని రోజుల నుంచి కోలీవుడ్, టాలీవుడ్, బాలీవుడ్ అని తేడా లేకుండా హీరో, హీరోయిన్ల మధ్య ఎఫైర్స్ ఉన్నట్లు ట్వీట్స్ చేస్తూ నెటిజన్ల సహనాన్ని పరిక్షీస్తున్నాడు. మొన్నటికి మొన్న కెజిఎఫ్ యష్ తనను వేధించాడని హీరోయిన్ శ్రీనిధి చెప్పిందని చెప్పాడు. ఆ తరువాత పవన్ ఉమనైజర్ అన్నాడు.. సమంత అబార్షన్ చేయించుకున్నది అన్నాడు. ఇక ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ మీద పడ్డాడు.

Akhil Akkineni: మరోసారి ప్రేమలో పడ్డ అఖిల్.. అంతమాట అనేశాడేంటి..?

తాలా అజిత్ గురించి టాలీవుడ్ ప్రేక్షకులకు కూడా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లో అతనికి ఎంత క్రేజ్ ఉందో తెలుగులో కూడా అంతే క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇక ఈ మధ్యనే తెగింపు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అజిత్, హీరోయిన్ షాలినిని ప్రేమించి పెళ్లిచేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు. కోలీవుడ్ లో అడోరబుల్ కపుల్స్ లిస్ట్ లో అజిత్- షాలిని జంట టాప్ 5 లో ఉంటారు. ఇక ఈ జంట గురించి ఉమైర్ సంధు చేసిన ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ” షాకింగ్.. తాలా అజిత్ ప్రస్తుతం రహస్య ఎఫైర్ ను నడిపిస్తున్నాడు” అని ట్వీట్ చేశాడు. అయితే అది ఎవరితో అనేది మాత్రం చెప్పలేదు. దీంతో కోలీవుడ్ లో ఈ ట్వీట్ కలకలం రేపుతోంది. అవన్నీ అబద్దాలు అని తాలా అజిత్ ఫ్యాన్స్ చెప్పుకొస్తున్నారు. మరి ఇందులో నిజం ఎంత అనేది తెలియాలి.

Show comments