‘తల అజిత్’ నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్స్ ఎంటర్టైనర్ ‘తునివు’, తెలుగులో ‘తెగింపు’ పేరుతో డబ్ అవుతోంది. సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానున్న ఈ మూవీ నుంచి ‘చిల్లా చిల్లా’ అనే సాంగ్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ‘తునివు’ ఆల్బం నుంచి బయటకి వచ్చిన ఈ ఫస్ట్ సాంగ్ ని ‘గిబ్రాన్’ ట్యూన్ కంపోజ్ చేయగా ‘అనిరుద్’ పాడడం విశేషం. అనిరుద్ వాయిస్ ‘చిల్లా చిల్లా’ సాంగ్ కి ప్రాణం పోసింది. అజిత్ అభిమానుల్లో జోష్ నింపిన ‘చిల్లా చిల్లా’ సాంగ్ ‘తునివు’ ప్రమోషన్స్ కి మంచి ఊపు తెచ్చింది. ఈ సాంగ్ పాజిటివ్ బజ్ ని క్రియేట్ చెయ్యడంతో పాటు సినిమాపై అంచనాలని కూడా అమాంతం పెంచింది. లిరికల్ సాంగ్ లో అక్కడక్కడ ‘అజిత్’ డాన్స్ వేస్తున్న విజువల్స్ కూడా ఉండడంతో, అజిత్ ఫాన్స్ ఈ సాంగ్ ని యుట్యూబ్ లో రిపీట్ మోడ్ లో చూస్తున్నారు.
గత 24 గంటల్లో అత్యధిక వీక్షకులని పొందిన వీడియోగా ప్రపంచవ్యాప్తంగా టాప్ సెకండ్ ప్లేస్ లో ఉంది ‘చిల్లా చిల్లా’ సాంగ్. రిలీజ్ అయిన 15 గంటల్లో 7.5 మిలియన్స్ వ్యూస్, 980K లైక్స్ రాబట్టిన ‘చిల్లా చిల్లా’ టాప్ ట్రెండింగ్ లో ఉంది. ఇక సినిమా విషయానికి వస్తే జనవరి 11న ‘తునివు’ సినిమా ఆడియన్స్ ముందుకి రానుంది. హెచ్. వినోద్ డైరెక్ట్ చేసిన ఈ మూవీ ‘బ్యాంక్ హైస్ట్’ చుట్టూ తిరిగి కథతో తెరకెక్కింది. ‘బాడ్ మ్యాన్స్ గేమ్’ అంటూ ‘తునివు’ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ఈ మూవీకి ‘విజయ్’ నటించిన ‘వారిసు’ సినిమా నుంచి గట్టి పోటి ఎదురుకానుంది. ‘వారిసు’ సినిమా జనవరి 12న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఒకరోజు గ్యాప్ తో అజిత్, విజయ్ సినిమాలు రిలీజ్ అవుతుండడంతో… ఈ ఇద్దరిలో ఎవరు హిట్ కొడతారా అనే ఆసక్తి అందరిలో ఉంది.
