NTV Telugu Site icon

TG Vishwa Prasad: అమెరికాలో చిరంజీవికి సన్మానం..ఆనందంగా ఉందన్న విశ్వ ప్రసాద్

Tg Vishwaprasad

Tg Vishwaprasad

TG Vishwa Prasad Met Chiranjeevi at USA: సరిగ్గా వాలెంటైన్స్ డే రోజు మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి అమెరికా బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసింద. ఈ సందర్భంగా విశ్వంభర షెడ్యూల్ షూట్ గ్యాప్లో తాను అమెరికా వెళుతున్నానని వచ్చిన వెంటనే మళ్ళీ షూటింగ్లో పాల్గొంటానని మెగాస్టార్ చిరంజీవి చెప్పుకొచ్చారు. ఇక ఆసక్తికరమైన విషయం ఏమిటంటే అమెరికాకి వెళ్లిన చిరంజీవిని ప్రస్తుతం అక్కడే ఉన్న పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అధినేత, ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ కలిశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవికి సన్మానం చేయాలనే కోరికను ఆయన వెలిబుచ్చగా మెగాస్టార్ చిరంజీవి అందుకు ఒప్పుకున్నారు. దీంతో మెగాస్టార్ చిరంజీవితో కలిసి దిగిన ఫోటోని షేర్ చేసిన విశ్వప్రసాద్ మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడం అలాగే సన్మానానికి ఆయన అనుమతి తీసుకోవడం చాలా ఆనందంగా ఉందని చెప్పుకొచ్చారు.

SP Charan: ఎస్పీ బాలు వాయిస్ వాడేశారు.. కీడా కోలా టీంకి ఎస్పీ చరణ్ షాక్

ఇక ఈ మధ్యనే మెగాస్టార్ చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మ విభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది. దేశంలోనే రెండో అత్యంత ప్రతిష్టాత్మకమైన పౌర పురస్కారం కావడంతో ఈ పురస్కారం తనకి రావడం ఎంతో ఆనందంగా ఉందని మెగాస్టార్ చిరంజీవి ఆనందం వ్యక్తం చేశారు. అందుకే ఆయనని సన్మానించబోతున్నారు. ఇక ఆ సంగతి పక్కన పెడితే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ మెగాస్టార్ చిరంజీవితో కూడా ఒక సినిమా చేసే అవకాశం ఉందని ఈమధ్య ప్రచారం జరుగుతూ ఉండగా ఇప్పుడు ఆ నిర్మాత మెగాస్టార్ చిరంజీవిని కలవడం దానికి మరింత ఊతమిస్తోంది. హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ సినిమా ఉండే అవకాశం ఉందని టాలీవుడ్ సర్కిల్స్ లో పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తోంది.