Site icon NTV Telugu

Naatu Naatu: ఎన్టీఆర్-చరణ్ మాత్రమే కాదు వాళ్ల ఫాన్స్ కార్లు కూడా డాన్స్ చేశాయి

Naatu Naatu

Naatu Naatu

మన అచ్చ తెలుగు ఊర నాటు పాట ‘నాటు నాటు’కి వరల్డ్ ఆడియన్స్ జై కొట్టారు. ఆస్కార్ వేదికపై బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరిలో ఆస్కార్ గెలిచిన నాటు నాటు సాంగ్ కి ప్రపంచవ్యాప్త తెలుగు వాళ్లందరూ తమకి వచ్చిన స్టైల్ లో ట్రిబ్యూట్ ఇచ్చారు. ఇండియన్ మైఖేల్ జాక్సన్ గా పేరు తెచ్చుకున్న ప్రభుదేవా కూడా నాటు నాటు హుక్ స్టెప్ వేసి ట్రిబ్యూట్ ఇచ్చాడు. లేటెస్ట్ గా ఎన్టీఆర్, చరణ్ లు మాత్రమే కాదు ఆ హీరోల ఫాన్స్ కార్స్ కూడా నాటు నాటు పాటకి డాన్స్ వేశాయి. న్యూ జెర్సీలో చరణ్, ఎన్టీఆర్, ఆర్ ఆర్ ఆర్ సినిమా ఫాన్స్ టెస్లా కార్స్ అన్నింటినీ ఒక దగ్గర చేర్చి ‘నాటు నాటు’ పాటకి డాన్స్ వేసేలా చేశారు. నాటు నాటు సాంగ్ కి టెస్లా కార్ బ్యాక్ లైట్స్ ని రిథమిక్ గా ఒక సింక్ లో ఆన్ ఆఫ్ చేస్తూ ఒక డాన్స్ వీడియోలా చేశారు. టెస్లా లైట్స్ షోలో నాటు నాటు బీట్స్ కి కార్స్ డాన్స్ వేశాయి. ఈ వీడియోని ఆర్ ఆర్ ఆర్ మూవీ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ లో పోస్ట్ చేస్తూ “థాంక్స్ ఫర్ ది లవ్” అంటూ కోట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also: NTR 30: వాళ్లు మొదలుపెడితే మాములుగా ఉండడు… మొదలెట్టేసార్రా బాబు…

Exit mobile version