Tension to Tiger Nageswara Rao Movie team: మాస్ మహరాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ టైగర్ నాగేశ్వర రావు యూనిట్ కి షాక్ తగిలింది. వంశీకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న టైగర్ నాగేశ్వర రావు సినిమాను రిలీజ్ చేయబోతున్న క్రమంలో ఈ మధ్యనే రాజమండ్రిలో గ్రాండ్‌గా ఫస్ట్ లుక్ గ్లింప్స్ రిలీజ్ చేసి ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాలో రవితేజ స్టువర్టుపురం గజ దొంగగా కనిపించబోతుండగా రవితేజ కెరియర్లో హైయెస్ట్ బడ్జెట్ అండ్ ఫస్ట్ పాన్ ఇండియా ఫిల్మ్‌గా రాబోతోంది. అయితే ఈ టైగర్ నాగేశ్వరరావు సినిమా నిర్మాణాన్ని తక్షణమే నిలిపివేయాలి అని స్టువర్టుపురం వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు ఏపీ సినిమాటోగ్రఫి కమిషనర్ కు, డిజిపికి వినతి పత్రం సమర్పించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఫిలిం ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో అభిషేక్ అగర్వాల్ నిర్మాతగా వంశీ కృష్ణా దర్శకత్వంలో ‘టైగర్ నాగేశ్వర రావు’ సినిమాని అక్టోబర్ 20, 2023న తీసుకురావడానికి నిర్మాణం జరుగుతున్నదని వారు వినతి పత్రంలో పేర్కొన్నారు.
Dhwani : పదేళ్ళకే షార్ట్ ఫిలిం డైరెక్ట్ చేసిన బుడతడు.. తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు!
ఈ మధ్య రిలీజ్ చేసిన టీజర్ లో స్టువర్టుపురం గ్రామాన్ని దక్షిణ భారతదేశ నేర రాజధానిగా స్టువర్టుపురం వాసులైన మమ్ములను వ్యాఖ్యానించడమనేది అవమానించడంగా భావిస్తున్నాము అని ఆవేదన వ్యక్తం చేశారు. స్టువర్టుపురంలో గతించిపోయిన పది శాతం వ్యక్తుల నేర చర్యలు, చరిత్రను పరిగణిస్తూ మొత్తం స్టువార్టుపురం ప్రజలు నేరస్తులుగా భావింప చేసే పద్ధతిలో టైగర్ నాగేశ్వర రావు సినిమా ఉండబోతుందని దుయ్యబట్టారు. ఈ టీజర్ ని వీక్షిస్తే మా బాధ అర్ధం అవుతుంది అని అంటూనే గత 15 సంవత్సరాలకు పైగా తమ ఊరికి చెందిన 10% వ్యక్తులు కూడా నేరాలకి దూరంగా ఉంటూ చదువు, ఉద్యోగాలు, వ్యవసాయం మరియు వివిధ కులీ పనులు సాగిస్తూ జీవనాన్ని గడుపుతున్నారు అని పేర్కొన్నారు. ఇక ఈ సినిమాతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ రీ ఎంట్రీ ఇస్తోండగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్‌లో ఉంది.