NTV Telugu Site icon

CCL 2023 : సీసీఎల్ లీగ్ విజేతగా తెలుగు వారియర్స్.. అదరగొట్టిన అఖిల్

Telugu Warriors

Telugu Warriors

సెలబ్రిటీ క్రికెట్ లీగ్ 2023 టైటిల్ ను తెలుగు వారియర్స్ జట్టు సొంతం చేసుకుంది. భోజ్ పురి దబాంగ్స్ తో జరిగిన ఫైనల్ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో జయకేతనం ఎగురవేసింది. తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేకి అద్భుత ఇన్సింగ్స్ ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అత్యధికంగా నాలుగు సార్లు సీసీఎల్ టైటిల్ గెలిచిన జట్టుగా తెలుగు వారియర్స్ చరిత్ర సృష్టించింది. శనివారం జరిగిన మ్యాచ్ లో తొలుత టాస్ గెలిచిన తెలుగు వారియర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. ఇక టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భోజ్ పురి దబాంగ్స్ టీమ్ తొలి ఇన్సింగ్స్ ను పది ఓవర్ లలో ఆరు వికెట్లు కోల్పోయి 72 పరుగులు చేసింది. ఆదిత్య 26, అస్గర్ 11 పరుగులు చేశారు. వారియర్ నందకిషర్ రెండు వికెట్లు తీశాడు.

Also Read : Misbehave : మరదలిపై కన్నేసిన బావ.. అర్ధరాత్రి వెళ్లి ఏం చేశాడంటే ?

ప్రతిగా బ్యాటింగ్ చేూసిన తెలుగు వారియర్స్ జట్టు 4 వికెట్ల నష్టానికి 104 పరుగులు చేసింది. తొలి ఇన్సింగ్స్ లో 32 పరుగుల ఆధిక్యం సాధించింది తెలుగు వారియర్స్. ఓపెనర్, తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని 36 బంతుల్లో 67 పరుగులతో రాణించాడు. తరువాత సెంకండ్ ఇన్సింగ్స్ ప్రారంభించిన భోజ్ పురి దబాంగ్స్ ఆరు వికెట్లు కోల్పోయి 89 పరుగులు చేసింది. 58 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన తెలుగు వారియర్స్ 6.1 ఓవర్ లో ఒక్క వికెట్ నష్టపోయి లక్ష్యాన్ని ఈజీగా ఛేదించింది. అశ్విన్ 31 పరుగులు చేశాడు. స్పాన్సర్ల ద్వారా పాస్ లతో అభిమానులు పెద్ద ఎత్తుగా మ్యాచ్ వీక్షించారు. జట్టు మెంటర్ వెంకటేష్ ఫైనల్ మ్యాచ్ లో అభిమానులను ఉత్సాహాపరిచాడు. రాష్ట్రమంత్రి అమర్నాథ్ బాక్స్ లో కూర్చొని మ్యచ్ ను వీక్షించాడు. వారియర్స్ జట్టుతో కలిసి తొలి ఇన్సింగ్స్ ముగియగానే అభివాదం చేసి అభిమానుల్లో ఉత్సహాన్ని నింపారు.

Also Read : Virat Kohli : విద్యార్థులకు ఎగ్జామ్ పేపర్ లో కోహ్లీపై ప్రశ్న.. అదేంటో తెలుసా..?