‘Telugu Indian Idol’ Season 3 Grand Launch on June 14 on ‘Aha’: ఇండియన్ బిగ్గెస్ట్ మ్యూజికల్ రియాలిటీ షో ‘తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3 ప్రేక్షకులను అద్భుతంగా అలరించడానికి సిద్ధమైంది. మోస్ట్ పాపులర్ ఓటీటీ ‘ఆహా’లో జూన్ 14 న గ్రాండ్ గా లాంచ్ కానుంది. సెన్సేషనల్ కంపోజర్ ఎస్ ఎస్ తమన్, స్టార్ సింగర్స్, కార్తీక్, గీతా మాధురి జడ్జెస్ గా వ్యహరించే ఈ మ్యూజికల్ ఎక్సట్రావగంజా షో కోసం ఇప్పటికే ఆడియన్స్ పూర్తయ్యాయి. ఇండియన్ ఐడల్ శ్రీరామచంద్ర హోస్ట్ చేస్తున్న ఈ మ్యాసీవ్ మ్యూజికల్ కాంపిటీషన్ షోలో టాలెంటెడ్ కంటెస్టెంట్స్ తమ మెస్మరైజింగ్ వోకల్స్ తో ఆడియన్స్ ని అలరించబోతున్నారని అధికారిక ప్రకటన వచ్చేసింది.
Modi- Akira : మోడీతో అకిరా మాట్లాడింది ఇదే.. అసలు విషయం లీక్ అయిందిగా!
అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ఇండియన్ ఐడల్’ సీజన్ 3 ప్రోమోగా తాజాగా రిలీజ్ అయ్యింది. శ్రీ రామ చంద్ర వైబ్రెంట్ ఎంట్రీతో మొదలైన ప్రోమో ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. ప్రోమోలో జడ్జెస్ గా కనిపించిన ఎస్ ఎస్ తమన్, స్టార్ సింగర్స్, కార్తీక్, గీతా మాధురి ప్రజన్స్ మెయిన్ అట్రాక్షన్ గా నిలిచింది. తమన్ మరోసారి తన సెన్సాఫ్ హ్యూమర్ తో నవ్వులు పూయించారు. ఇక ఈ ప్రోమో చూస్తుంటే.. ఈసారి మ్యూజికల్ సెలబ్రేషన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉండబోతుందని అర్ధమవుతోంది. ప్రోమో గ్లింప్స్ లో కంటెస్టెంట్స్ వినిపించిన కొన్ని పాటలు ఎక్సయిట్మెంట్ ని పెంచేసేలా ఉన్నాయి. మొత్తానికి ఈ ప్రోమో సీజన్ 3 పై వున్న క్యురియాసిటీని మరింత పెంచింది. ఈ మ్యూజికల్ షో ‘ఆహా’లో ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 7 గంటలకు ప్రసారం కానుంది.
