NTV Telugu Site icon

తెలుగు ఫిల్మ్, టీవీ డైరెక్టరీ విడుదల, ఎస్పీబీకి అంకితం!

వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ సంస్థ 2014 నుండి తెలుగు ఫిల్మ్, టీవీ డైరెక్టరీ ప్రచురిస్తూ బుల్లితెర అవార్డులతో పాటు వెండితెర అవార్డులనూ అందిస్తోంది. వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ అధినేత విష్ణు బొప్పన ప్రతి ఏడాది లాగే ఈ ఏడాదికి సంబంధించిన సినిమా తారల డైరీని రూపొందించారు. ఈ డైరీని గానగంధర్వ, పద్మవిభూషణ్ ఎస్. పి. బాలసుబ్రమణ్యంకు అంకితమిచ్చారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమం శనివారం ప్రసాద్ ల్యాబ్ లో సినీప్రముఖుల సమక్షంలో జరిగింది. ‘మా’ అధ్యక్షులు వి.కె. నరేష్ డైరీని విడుదల చేసి నటుడు శివ బాలాజికి, విష్ణు బొప్పనకి అందజేశారు. త్వరలో జరగబోయే వీబీ ఎంటర్‌టైన్మెంట్స్ బుల్లితెర అవార్డుల బిగ్ పోస్టర్ ను ఆవిష్కరించారు.