NTV Telugu Site icon

Jani Master: జానీ మాస్టర్ పై ముందు సెక్సువల్ హరాస్మెంట్ కంప్లైంట్ రాలేదు.. కానీ?

Janimasterss

Janimasterss

Telugu Film Chamber Press Meet on Jani Master: జానీ మాస్టర్ మీద ఆరోపణలు రాగానే..వివాదం తేలే వరకు అతన్ని డాన్సర్ అసోసియేషన్ అధ్యక్ష పదవి నుంచి తప్పించాలని ఫెడరేషన్ ను ఆదేశించామని ఫిలిం ఛాంబర్ సెక్రటరీ దామోదర్ ప్రసాద్ పేర్కొన్నారు. ఇక ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నటి ఝాన్సీ మాట్లాడుతూ ఇది సినిమా పరిశ్రమలో ఇద్దరు వ్యక్తుల మధ్య వచ్చిన ఇష్యూ అని, ఇది అన్ ఆర్గనైజెడ్ సెక్టార్ కాబట్టి ప్రభుత్వం తరపు నుంచి మహిళా రక్షణ నిమిత్తం సరైన గైడ్ లైన్స్ లేవని అన్నారు. శ్రీరెడ్డి ఇష్యూ తరువాత ఒక కమిటీ ఫామ్ అయింది అని పేర్కొన్న ఆమె జానీ మాస్టర్ ఇష్యూలో గత రెండు వారాలుగా మా కమిటీ పరిశీలనలో ఉందని అన్నారు. ఈ వివాదం లో బాధితురాలు తొలుత నా వర్క్ పరంగా హరాస్ మెంట్ అని వచ్చింది కానీ ఆ తరువాత సెక్సువల్ హరాస్ మెంట్ బయటపెట్టింది అని అన్నారు. తన స్టేట్ మెంట్, జానీ స్టేట్ మెంట్ కూడా రికార్డ్ చేశాం.

అయితే సెక్సువల్ హరాస్ మెంట్ అనేది వర్క్ ప్లేస్ లో కాదు అని అన్నారు. అయితే ఆమె లీగల్ గా ప్రొసీడ్ అయి పోలీస్ కేసు పెట్టడం జరిగింది,మేమే తనను పోలీసులను కూడా ఆశ్రయించమని కోరామని, పోలీసులు విచారణ ,మా విచారణ ప్యారలల్ గా జరుగుతుందని అన్నారు. అయితే..‌మీడియా మాత్రం బాధితురాల ఫేస్ రివీల్ చేయకూడదని కోరుతున్నాం అని అన్నారు. ఎంక్వెరీ కొనసాగుతోంది…‌90 రోజుల లోపే దీనిపై క్లారిటి వస్తుంది,కానీ అమ్మాయిలు ఎవరైనా కంప్లైట్ చేస్తే , ఆమె‌ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి.. ఉండాలి కూడా‌‌ అని అన్నారు. దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ మీడియా నుంచే జానీ మాస్టర్ వివాదం మా‌ వద్దకు వచ్చింది,2013 లో ఆసరా అని పెట్టాం.. 2018 లో సరికొత్తగా ప్యానల్ పెట్టాం, ఎన్ని పెట్టినా ఉమెన్ కు ధైర్యం ఇవ్వలేకపోతున్నాము అని అన్నారు.

ప్రతి అమ్మాయికి తెలియాలి.. తమకు సపోర్ట్ ఉందనే ధైర్యం కావాలి..‌అందుకు తగ్గ కమిటీ ఉండాలి, 90 రోజుల్లో జానీ మాస్టర్ కేసు సాల్వ్ అవుతుంది. సినిమా ఇండస్ట్రీ లో ప్రతి అమ్మాయికి రక్షణ కావాలి, వర్క్ దొరకదనే భయం కాకుండా, ప్రతిభకు తగ్గ గుర్తింపు అవకాశం ఉండాలి, ఆ పరిస్దితులు రావాలన్నది మా ఆలోచన అని అన్నారు. ఛాంబర్ తరపున ప్రతి యూనియన్ కు ఓ‌ కంప్లైట్ కమిటీ పెట్టుకోవాలని సూచించనున్నామని, ఛాంబర్ తరపున కమిటీ ఉండనే ఉందని అన్నారు. డాన్సర్ యూనియన్ వారు కూడా ఈ విషయంలో మాతో పూర్తి సహకారాన్ని అందిస్తున్నారని ఆయన అన్నారు. నటి ప్రగతి మాట్లాడుతూ అమ్మాయిలకు భరోసా ఉండేలా పరిస్థితులు ఉండాలి, అది లేకపోవడం వల్ల చాలామంది కంప్లైంట్ ఇవ్వ లేకపోతున్నారు అని అన్నారు.

ఇక తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పరిశ్రమలోని లైంగిక వేధింపుల ఫిర్యాదులను పరిష్కరిస్తున్న లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్‌ను 2018 నుంచి కలిగి ఉంది. ఈ ప్యానెల్ వారు మహిళా కొరియోగ్రాఫర్ నుండి వచ్చిన ఫిర్యాదును స్వీకరించారు. తెలుగు ఫిల్మ్ & టీవీ డ్యాన్సర్స్ & డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్‌లో జానీ మాస్టర్ మీద వచ్చిన ఈ ఫిర్యాదును పరిష్కరించడానికి కమిటీని ఏర్పాటు చేశారు. ఈ ఫిర్యాదు విచారణ ప్రక్రియలో ఉంది, కావున ఆరోపించిన మగ కొరియోగ్రాఫర్‌ను యూనియన్‌లో ప్రెసిడెంట్ పోస్ట్‌లో ఉంచడానికి విచారణ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా నిలిపివేయబడుతుందని కమిటీ మధ్యంతర నివేదికను ఇవ్వడం జరిగింది.

కేసు విషయమై కమిటీ వివరాలు :
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్- లైంగిక వేధింపుల పరిష్కార ప్యానెల్:
K.L. దామోదర్ ప్రసాద్, సెక్రటరీ & కన్వీనర్, ఝాన్సీ, చైర్‌పర్సన్
అంతర్గత సభ్యులు: తమ్మారెడ్డి భరద్వాజ, సుచిత్రా చంద్రబోస్, వివేక్ కూచిభొట్ల, ప్రగతి మహావాది
బాహ్య సభ్యులు: రామలక్ష్మి మేడపాటి, సామాజిక కార్యకర్త మరియు మీడియా నిపుణురాలు, కావ్య మండవ, న్యాయవాది మరియు POSH నిపుణురాలు
_______________
ఏదైనా లైంగిక వేధింపుల ఫిర్యాదుల విషయంలో సినీ పరిశ్రమలో పని చేసే మహిళలు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌ను సంప్రదించవచ్చు. తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కార్యాలయం వెలుపల ఫిర్యాదు పెట్టె ఉంచబడింది, దీనిని ఉదయం 6 నుండి రాత్రి 8 గంటల మధ్య యాక్సెస్ చేయవచ్చని ఛాంబర్ ప్రకటించింది. ఫిర్యాదుల నిమిత్తమై మమ్మల్ని పోస్ట్ లేదా కొరియర్ ద్వారా క్రింది చిరునామాకు కూడా పంపవచ్చు.
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, డా. డి. రామానాయుడు బిల్డింగ్ కాంప్లెక్స్, ఫిలింనగర్, జూబ్లీహిల్స్, హైదరాబాద్-500 096. ఫిర్యాదులను నమోదు చేయడానికి ప్రత్యేక ఫోన్ నెంబర్ వాట్సాప్ లేదా టెక్స్ట్ నెం. 9849972280, ఈమెయిల్ ఐడీ: complaints@telugufilmchamber.in
నోట్ : మీరు పంపబడిన వివరాలు గోప్యంగా ఉంచబడును.