తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, చిత్రపురి కాలనీ కమిటీలో ఎలక్షన్స్ వెంటనే నిర్వహించాల్సిన అవసరం ఉందని.. చిన్న నిర్మాతల ఆధ్వర్యంలో ఫిల్మ్ ఛాంబర్ ముందు ధర్నా జరిగింది. ఈ ధర్నాలో సీనియర్ ఆర్టిస్ట్, నిర్మాత అశోక్ కుమార్ కూడా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ.. “ఇండస్ట్రీని రోడ్డు మీదకు తేవడం దుర్మార్గం. ఏదైనా నిర్ణయం కావాలంటే అది ఛాంబర్ ద్వారా జరగాలి. ఛాంబర్ మనకు ప్రభుత్వ బాడీలా వ్యవహరిస్తుంది. అందుకే రెండు సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు తప్పనిసరిగా జరగాలి” అని చెప్పారు. అసలు సమస్య ఏమిటంటే, తెలంగాణ వర్గాల మధ్య గొడవలు భయపడుతూ కొన్ని సమావేశాలను తిరుపతికి తరలించారు. అలాగే, కార్మికుల సమ్మె కారణంగా ఎన్నికలు తరచుగా వాయిదా పడుతూ వచ్చాయి. ఈసీ (ఎలక్షన్ కమిటీ) సమావేశాల్లో ఎన్నో సార్లు చెప్పినప్పటికీ ఎన్నికలు ఇంకా నిర్వహించలేదు. కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి గారు ప్రెసిడెంట్‌ను పిలిస్తే కూడా రావడం లేదని ఫిల్మ్ వర్గాలు అభిప్రాయపడ్డాయి.
Also Read : Manchu Lakshmi : ఫిల్మ్ ఛాంబర్‌లో కలకలం.. సీనియర్ జర్నలిస్ట్‌పై మంచు లక్ష్మి ఫిర్యాదు
FDC చైర్మన్ దిల్ రాజు జోక్యం చేసుకొని ఎన్నికలను వెంటనే నిర్వహించాలి. ఇటీవల అక్టోబర్ 12న ఎన్నికలు పెడతామని చెప్పగా, మళ్లీ అక్టోబర్ 26న అని మార్చారు. ఎన్ని సార్లు మాట మారుస్తారు? ప్రజాస్వామ్యంలో ఎన్నికలు పెట్టాల్సిన బాధ్యత ఉంది అని పేర్కోన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో ప్రతాని రామకృష్ణ గౌడ్, గురు రాజ్, మోహన్ గౌడ్ తదితరులు కూడా పాల్గోన్నగా.. ఐదేళ్ల అయ్యాక కూడా ఎన్నికలు లేకుండా నేనే సీఎం అంటే కుదురుతుందా? అధికారంలో ఉన్న వాళ్లే ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి అని పేర్కొన్నారు.
