NTV Telugu Site icon

Star Maa : స్టార్ మా సరికొత్త ధారావాహిక “నువ్వుంటే నా జతగా”

Star Maa

Star Maa

స్టార్ మా సపరివారంలో సరికొత్తగా ఒక సీరియల్ వచ్చి చేరుతోంది. పేరు “నువ్వుంటే నా జతగా”. మారుతున్న ప్రేక్షకుల అభిరుచులకు తగినట్టుగా ఇంట్లో అందరికీ నచ్చేలా భిన్నమైన అంశాలను అందించడం స్టార్ మా ప్రత్యేకత. ఈసారి అందిస్తున్న కథ ప్రతి తరాన్నీ కనెక్ట్ చేయబోతోంది “నువ్వుంటే నా జతగా”. ప్రేమతో సాధించలేనిది ఈ ప్రపంచంలో ఏదీ ఉండదని రుజువు చేయడానికి వస్తున్న కథ ఇది. ఈ కథ అనుబంధానికి ఓ కొత్త నిర్వచనం. ప్రేమకి ఓ విలక్షణమైన వివరణ. సంప్రదాయానికి, సంస్కృతికి ఎంతో విలువ ఇచ్చే ఒక అమ్మాయికి; గాలికి తిరిగే కుర్రాడికి మధ్య ఒక అనుకోని మూడుముళ్ల బంధం ఈ కథకి మూలం. ఈ నెల16 నుంచి.. రాత్రి 9.30 గంటలకు ఈ ధారావాహిక ప్రారంభం కాబోతోంది. ప్రేమ ఉన్నచోట కోపం ఉంటుందనే ఒక ప్రాథమిక సూత్రానికి, ప్రేమ ఉంటే తప్పుని దిద్దాల్సిన బాధ్యత కూడా ఉంటుందనే మౌలికమైన ఆదర్శాన్ని “నువ్వుంటే నా జతగా” సీరియల్ కథ చూపించబోతోంది.

Also  Read : Robinhood : శివరాత్రికి రాబిన్ హుడ్ రిలీజ్..?

ఏ అమ్మాయికైనా పెళ్లి గురించి ఎన్నో కలలు ఉంటాయి. కానీ ఆ కలలన్నీ మూడుముళ్లతోనే కరిగిపోతే..? జీవితం అక్కడ ఆగిపోయినట్టు కాదు. పోగొట్టుకున్నచోటే వెతుక్కోవాలన్న థియరీని ఒక కొత్త దృక్పథంతో చెప్పే ఈ కథ స్టార్ మా ప్రేక్షకులను అలరించబోతోంది.ప్రేమతో సాధించలేనిది ఉండదు అని ఆ అమ్మాయి నిరూపించడానికి వస్తోంది. పెళ్లి అనేది ఏదో అలా జరిగిపోయింది గానీ దాని మీద నాకు సీరియస్ నెస్ లేదు అని తన అభిప్రాయాన్ని చెప్పడానికి హీరో వస్తున్నాడు. అదే ఇద్దరి మధ్య ఘర్షణ. దానికి దృశ్యరూపమే “నువ్వుంటే నా జతగా” సీరియల్. ఈ నెల16 నుంచి రాత్రి 9.30 గంటలకు ఈ ధారావాహిక ప్రారంభం అవుతోంది. మిస్ అవ్వకండి. మీరు చూడండి. మీ వాళ్ళు అందరినీ చూడమని చెప్పండి.

Show comments