NTV Telugu Site icon

Navdeep: హైకోర్టులో నవదీప్ కి షాక్.. అరెస్ట్ తప్పదా?

Navdeep Suicide

Navdeep Suicide

Telangana High Court Disposes Navdeep Bail Petition: తెలుగు సినీ హీరో నవదీప్ గత కొద్ది రోజుల నుంచి డ్రగ్స్ కేసు వ్యవహరిత వార్తలలో ఎక్కువగా వినిపిస్తోంది. కొద్ది రోజుల క్రితం హైదరాబాదు పోలీసులు అరెస్టు చేసిన రామచంద్ అనే వ్యక్తి ద్వారా నవదీప్ కి డ్రగ్స్ కేసుతో సంబంధాలు ఉన్నాయని పోలీసులు భావిస్తున్నారు కొద్ది రోజుల క్రితం హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ నవదీప్ కి కూడా ఈ కేసుతో సంబంధాలు ఉన్నాయని ఆయన పరారీలో ఉన్నాడని హాట్ కామెంట్లు చేశారు తర్వాత నవదీప్ తాను పరారీలో లేనని హైదరాబాదులో ఉన్నానని క్లారిటీ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు అయితే ఈ కేసులో నవదీప్ ని అరెస్టు చేయకుండా ఆయన హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసి ఆ మేరకు ఉత్తర్వులు కూడా తెచ్చుకున్నారు అయితే ఇప్పుడు మరోసారి కోర్టుకు వెళ్లిన నవదీప్ కి మాత్రం హైకోర్టు షాక్ ఇచ్చింది.  నవదీప్కు తెలంగాణ హైకోర్టులో చుక్కుదురైంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్ ను న్యాయస్థానం డిస్పోజ్ చేసింది. నవదీపు కి బెయిల్ ఇవ్వొద్దన్న నార్కొటిక్ పోలీసుల వాదనతో ఏకీభవించిన కోర్టు.. 41A కింద నోటీసులు ఇవ్వాలని పోలీసులకు సూచించింది.

The National Testing Agency (NTA): విడుదలైన 2024 NEET, JEE మెయిన్ పరీక్ష తేదీలు..

ఇక ఈ మేరకు పోలీసుల విచారణకు హాజరుకావాలని హీరోకు కోర్టు స్పష్టం చేసింది. నిన్ననే హీరో నవదీప్ ఇంట్లో నార్కోటిక్ బ్యూరో సోదాలు కూడా చేసంది. పోలీసులు సోదాలు చేసే సమయంలో ఇంట్లో లేని నవదీప్, తనను అరెస్టు చేయవద్దు ఇప్పటికే కోర్టు నుంచి ఆదేశాలు తెచ్చుకున్నాడు. నిన్నటి వరకు నవదీప్ ను అరెస్టు చేయొద్దు అంటూ హైకోర్టు ఆదేశాలు ఉండగా డ్రగ్స్ కేస్ లో నవదీప్ మరోసారి హై కోర్ట్ లో పిటిషన్ వేశాడు. డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ పిటిషన్ పై నేడు హైకోర్టు విచారణ జరిగింది. నవదీప్ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేసిన నార్కోటిక్ బ్యూరో అధికారులు తమకు నవదీప్ కస్టడీ కావాలని కోరినట్టు తెలుస్తోంది. ఇక నిన్న సోదాలకి పోలిసులు వెళ్ళిన సమయంలో నవదీప్ ఇంట్లో లేరు. ఇక ఈ మాదాపూర్ డ్రగ్స్ కేస్ లో 37వ నిందితుడిగా నవ దీప్ ను నార్కోటిక్ బ్యూరో భావిస్తోంది. తన మిత్రుడు రామ్ చందు దగ్గర నుంచి ఆయన డ్రగ్స్ తీసుకున్నట్లుగా పోలీసుల వద్ద ఆధారాలు ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే నవదీప్ స్నేహితుడు రామచంద్ ని అరెస్ట్ చేసిన పోలీసులు తాజా కోర్టు తీర్పు నేపథ్యంలో నవదీప్ ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతుంది.