NTV Telugu Site icon

Tejaswi Madiwada : పెళ్లి పీటలెక్కబోతున్న తేజస్వి.. వరుడు ఎవరంటే?

Tejaswi Madivada

Tejaswi Madivada

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోయిన్ గా సినిమాల్లో నటించి బాగా ఫెమస్ అయ్యింది.. అతి తక్కువ కాలంలోనే నటిగా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఈమె సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు అనే సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలో చిన్న పాత్రలో నటించింది. ఆ సినిమా ఆమె లైఫ్ కు టర్నింగ్ పాయింట్ అనే చెప్పాలి.. కానీ ఆ తర్వాత కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అలాగే హీరోయిన్ గా కూడా చేసింది.. ఆ సినిమాలు పెద్దగా హిట్ అవ్వలేదు కానీ బోల్డ్ బ్యూటీ గా పాపులర్ అయ్యింది..

ఈ అమ్మడు తేజస్వి మదివాడ ఐస్ క్రీం,సుబ్రమణ్యం ఫర్ సేల్, కేరింత, నాన్న నేను నా బాయ్ ఫ్రెండ్స్, కమిట్మెంట్, మళ్లీ మళ్లీ ఇది రాని రోజు వంటి మరికొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా.. హీరోయిన్ గా చేసింది. ఇక తేజస్వి మదివాడ కేవలం సినిమాల్లోనే కాకుండా బుల్లితెరపై ప్రసారమయ్యే ప్రముఖ రియాల్టీ షో తో కనిపించింది.. హౌస్ లో బోల్డ్ బ్యూటీగా పేరు తెచ్చుకుంది..ఆ తర్వాత బిబి జోడిలో కూడా అఖిల్ తో పాల్గొని డాన్స్ చేసిన సంగతి మనకు తెలిసిందే.ఇదిలా ఉంటే ఈమె సినిమాలతో కాకుండా తన హాట్ హాట్ ఫోటోలతో ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన అంద చందాలను ఫోటోల రూపంలో షేర్ చేస్తూ కుర్రకారును ఫిదా చేస్తుంది. అలాంటి తేజస్వి మదివాడ తాజాగా పెళ్లికి సిద్ధమైంది అంటూ ఒక వార్త నెట్టింట షికారు చేస్తుంది.

గతంలో కూడా చాలాసార్లు ఇలానే వార్తలు వినిపించాయి. అయితే అప్పుడు స్పందించిన అమ్మడు ఇప్పటిలో ఇలాంటి ఆలోచన లేదని వార్తలకు చెక్ పెట్టింది..తేజస్వి మదివాడ తన ఫ్రెండ్ ని భర్తగా తన జీవితంలోకి ఆహ్వానిస్తుందట. ఇక ఇప్పటికే సీక్రెట్ గా ఎంగేజ్మెంట్ చేసుకుందని, త్వరలోనే పెళ్లికి సంబంధించిన గుడ్ న్యూస్ బయటపెడుతుంది అంటూ కొంతమంది నెటిజన్స్ ఆమె పెళ్లి వార్తలను వైరల్ చేస్తున్నారు.. మరి ఇందులో ఎంత నిజం ఉంది అనేది తేజస్వి మదివాడ స్పందిస్తే గానీ తెలియదు.. చూద్దాం ఏం చెబుతుందో..