Site icon NTV Telugu

‘సర్కస్ కార్ -2’లో తేజస్వి మదివాడ!

Circus-car2

నల్లబిల్లి వెంకటేష్ దర్శకత్వంలో రూపొందిన ‘సర్కస్ కార్’కు సీక్వెల్ గా రాబోతోంది ‘సర్కస్ కార్ -2’. ఈ సినిమాలో తేజస్వి మదివాడ హీరోయిన్ గా నటిస్తోంది. ‘బిగ్ బాగ్’ ఫేమ్ ఆషురెడ్డి, మస్త్ అలీ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం తూర్పు గోదావరిలోని మారేడుమిల్లి అడవుల్లో జరుగుతోంది. ఈ సినిమా గురించి తేజస్వి మదివాడ మాట్లాడుతూ, ”నల్లబిల్లి వెంకటేష్ డైరెక్షన్ లో వచ్చిన ‘సర్కస్ కార్’ మూవీ చూశాను. చాలా బాగా నచ్చింది.

Read Also : గ్లామర్ హద్దులు చెరిపేస్తున్న సామ్… పిక్స్ వైరల్

ఆ చిత్రం సీక్వెల్ లో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. సీక్వెల్ స్టోరీ కూడా చాలా గ్రిప్పింగ్ గా ఉంది” అని అన్నారు. నిర్మాత శివరాజు వి.కె మాట్లాడుతూ, ” ‘సర్కస్ కార్’ సాధించిన ఘన విజయం ఇచ్చిన ప్రోత్సాహంతో మా డైరెక్టర్ నల్లబిల్లి వెంకటేష్… ఈ సీక్వెల్ ను మరింత ఆసక్తిగా తెరకెక్కిస్తున్నారు. దెయ్యాలను ప్రత్యక్షంగా చూడాలనుకున్న ఓ ఊరి పిల్లలు చేసే ప్రయత్నాలు… వాటి పరిణామాల కారణంగా ఏర్పడే హాస్యం ప్రేక్షకులను అలరిస్తుంది. భయంతో కూడిన వినోదాత్మక చిత్రంగా దర్శకుడు దీనిని తెరకెక్కిస్తున్నారు” అని చెప్పారు. బేబి శ్రీదేవి, మాస్టర్ రోషన్, మాస్టర్ ధృవ్ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి చైతన్య సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version