Mirai : యంగ్ హీరో తేజసజ్జా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మిరాయ్. ఇప్పటికే వచ్చిన టీజర్ ఆకట్టుకుంటోంది. సెప్టెంబర్ 5న రిలీజ్ చేయడానికి రెడీ అవుతున్నారు. ఇప్పటికే రెండు సార్లు రిలీజ్ డేట్ ను మార్చుకున్నారు. ఈసారి కచ్చితంగా వస్తుందని అనుకుంటున్నారు. ఇలాంటి టైమ్ లో మూవీని వాయిదా వేస్తారంటూ సోషల్ మీడియాలో తెగ వార్తలు వస్తున్నాయి. సెప్టెంబర్ 5న అనుష్క నటించిన ఘాటీ మూవీతో పాటు రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ సినిమా, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన మూవీ, తమిళం నుంచి రెండు పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి. మిరాయ్ పాన్ ఇండియా మూవీ. భారీ బడ్జెట్ తో నిర్మించారు. పెద్ద పోటీ లేకుండా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారు.
Read Also : Mahesh Babu : మహేశ్ బాబు కూతురు సితారకు ‘ఫేక్’ కష్టాలు..
అందుకే వాయిదా వేస్తున్నారంటూ ప్రచారం జరుగుతోంది. కానీ చూస్తుంటే వాయిదా వేయడం లేదని తెలుస్తోంది. ఎందుంటే ఇప్పటికే తేజ సజ్జా ప్రమోషన్లు స్టార్ట్ చేశాడు. వరుసగా ప్రోగ్రామ్స్ కు వెళ్తూ మంచి బజ్ పెంచేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఒకవేళ మూవీని వాయిదా వేస్తే మళ్లీ మంచి డేట్ దొరకదు. సెప్టెంబర్ లో ఓజీ, అఖండ-2 వస్తున్నాయి. అక్టోబర్ లో పెద్ద సినిమాలే ఉన్నాయి. కాబట్టి చిన్న సినిమాలతో పోటీ పడినా.. కంటెంట్ ను నమ్ముకుని రిలీజ్ చేసేందుకే రెడీ అవుతున్నారంట. త్వరలోనే ఈ రూమర్లకు చెక్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మూవీపై మంచి అంచనాలు ఉన్నాయి కాబట్టి తమకు ఎలాంటి ఇబ్బంది లేదని మూవీ టీమ్ భావిస్తోంది.
Read Also : Prabhas : రూ.50కోట్లు ఇచ్చిన ప్రభాస్.. ఎవరికో తెలుసా..?
