NTV Telugu Site icon

NTRNeel : ‘డ్రాగన్’ సెకండ్ షెడ్యూల్ కు భారీ ప్లానింగ్

Ntrneel

Ntrneel

పవర్ హౌజ్ కాంబినేషన్ అంటే ఎలా ఉంటుందో చూపించేందుకు ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్‌ రెడీ అవుతున్నారు. దేవర తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ పాన్ ఇండియా మార్కెట్ లో సత్తా చాటాడు. అదే జోష్ తో బాలీవుడ్ డెబ్యూ సినిమా  వార్ 2 ను కూడా ఫినిష్ చేసారు. ఇక తారక్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న ప్రశాంత్ నీల్ సినిమాను మొదలు పెట్టాడు టైగర్. మైత్రీ మూవీ మేకర్స్ తో పాటు ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నఈ సినిమాకు డ్రాగన్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.

Also Read : Mazaka : ఒకరోజు ముందుగా ‘మజాకా’ పెయిడ్ ప్రీమియర్స్

కాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్‌ ఇటీవల హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో మొదలు పెట్టాడు ప్రశాంత్ నీల్. ఈ సినిమాకు సంబందించి అల్లర్లు , రాస్తారోకో షాట్స్ తీస్తున్నారు. నెల రోజులు తారక్ లేని సీన్స్ ను షూట్ చేయనున్నారు.ఇక హైదరాబాద్ లో ఫస్ట్ షెడ్యూల్ ను ఫినిష్ చేసి సెకండ్ షెడ్యూల్ ను మొదలుపెట్టేందుకు రెడీ అవుతన్నాడట దర్శకుడు ప్రశాంత్ నీల్. ఈ సెకండ్ షెడ్యూల్ షూటింగ్ కోసం వెస్ట్ బెంగాల్ లోని కోల్‌కతా కు వెళ్లనుంది యూనిట్. ఈ సినిమా 1960లోని వెస్ట్ బెంగాల్ నేపధ్యంలో ఉండనుంది. కోల్‌కతాలో సినిమాలోని మేజర్ సీన్స్ ను షూట్ చేయనుంది టీమ్. ఇక ఆ తర్వాత మూడవ షెడ్యూల్ ను ఫారిన్ లో షూట్ చేయనున్నారు. అందుకోసం ఏర్పాట్లు చేస్తున్నారు.కాగా జూనియర్ ఎన్టీఆర్ మాత్రం మార్చి 30న డ్రాగన్ షూట్ సెట్స్ లో అడుగుపెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది.