NTV Telugu Site icon

NTR 31: ఎన్టీఆర్ కోసం ఏం ప్లాన్ చేసావ్ నీల్?

Ntr 31

Ntr 31

యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా ఎన్నో రోజులుగా ఎన్టీఆర్ ఫాన్స్ ని ఈగర్ గా వెయిట్ చేయిస్తున్న ఆ అప్డేట్… ‘NTR31’ అనౌన్స్మెంట్ బయటకి వచ్చేసింది. KGF, సలార్ సినిమాలతో ఇండియాస్ బిగ్గెస్ట్ కమర్షియల్ డైరెక్టర్స్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్న ప్రశాంత్ నీల్… మాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కలిసి ఒక సినిమా చేస్తున్నారు అనే వార్తనే చాలా పెద్ద విషయం. గత ఏడాది కాలంగా వినిపిస్తున్న ఈ న్యూస్ ని నిజం చేస్తూ లాస్ట్ ఇయర్ ఎన్టీఆర్ బర్త్ డే రోజున ‘ఎన్టీఆర్ 31’ ప్రాజెక్ట్ ఆన్ అయినట్లు ప్రకటన వచ్చింది. ‘ఎన్టీఆర్ 31’ సినిమా 2024 మార్చ్ నుంచి సెట్స్ పైకి వెళ్తుందని అప్డేట్ ని మేకర్స్ ఇచ్చేసారు. ప్రశాంత్ నీల్ డ్రీమ్ ప్రాజెక్ట్ గా చెప్పే ‘ఎన్టీఆర్ 31’ సినిమా షూటింగ్ నెక్స్ట్ మార్చ్ నుంచి అనే అప్డేట్ బయటకి రాగానే ఇండియా వైడ్ సెన్సేషన్ క్రియేట్ అయ్యింది. లేటెస్ట్ గా ప్రశాంత్ నీల్ పుట్టిన రోజున కూడా ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్ నుంచి స్పెషల్ పోస్ట్ బయటకి వచ్చింది.

దీంతో నందమూరి ఫాన్స్ ఎన్టీఆర్ 31 టాగ్ ని టాప్ ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ ఎలాంటి సినిమా చేస్తాడు? పవర్ హౌజ్ లాంటి ఈ కాంబినేషన్ ఎలాంటి హవోక్ క్రియేట్ చేస్తుంది అనేది చూడాలి. ఇదిలా ఉంటే ఈ ప్రాజెక్ట్ ఈ పాటికి ఎప్పుడో రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వాల్సి ఉంది కానీ కొరటాల శివ-ఎన్టీఆర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘దేవర’ డిలే అవ్వడం… ఇదే సమయంలో ప్రశాంత్ నీల్ ‘సలార్’ నుంచి ఇంకా బయట పడకపోవడంతో ‘ఎన్టీఆర్ 31’ డిలే అయ్యింది. సెప్టెంబర్ 28తో ప్రశాంత్ నీల్ ఫ్రీ అయిపోయి ఎన్టీఆర్ 31 వర్క్స్ స్టార్ట్ చేయనున్నాడు. నవంబర్ నుంచి ప్రీప్రొడక్షన్ వర్క్స్ ని మొదలు పెట్టి అయిదు నెలల పాటు అంతా ప్రిపేర్ చేసుకోని మార్చ్ నుంచి రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.