Site icon NTV Telugu

Bramhi: మా దేవుడు నువ్వేనయ్యా… మా కోసం వచ్చావయ్యా

Brahmi

Brahmi

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు అంటే పాన్ ఇండియా సినిమాలు ఎక్కువ అయ్యి యాక్షన్ మోడ్ లోకి వెళ్తున్నాయి కానీ ఒక దశాబ్దం క్రితం వరకూ ప్రతి సినిమాలో కామెడీ ఉండేది. కామెడీ అంటే బ్రహ్మానందం గారు ఉండాల్సిందే. వెయ్యికి పైగా సినిమాలలో కనిపించి, ఒక్క డైలాగ్ కూడా చెప్పకుండా కేవలం ఎక్స్ప్రెషన్స్ తో మనల్ని నవ్వించిన బ్రహ్మానందం గారు ఇటివలే సినిమాలు బాగా తగ్గించారు. అప్పుడప్పుడూ జాతిరత్నాలు, వీర సింహా రెడ్డి లాంటి సినిమాల్లో అలా కనిపించి మనల్ని కాసేపు నవ్వించి వెళ్ళిపోతున్నారు కానీ బ్రహ్మానందం గారి మార్క్ తో ఫుల్ లెంగ్త్ సినిమా రాలేదు. మీమ్ పేజస్ ని, ట్రోల్స్ కి, సరదా జోకులకి ఇలా ఈరోజు సోషల్ మీడియాలో జరిగే ప్రతి కాన్వర్జేషణ్ కి బ్రహ్మానందం గారి టెంప్లేట్లే నడిపిస్తున్నాయి. ఆయన మరోసారి ఫుల్ లెంగ్త్ కామెడీ క్యారెక్టర్ సినిమా చేస్తే ఎలా ఉంటుంది? మనం ఎంతగానో వెయిట్ చేస్తున్న ఆ మ్యాజిక్ ని తెరపై మరోసారి చూపించడానికి దర్శకుడు తరుణ్ భాస్కర్ రెడీ అయ్యాడు. మన ‘బ్రహ్మీ’ని రీలాంచ్ చేస్తున్నట్లు తరుణ్ భాస్కర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చాడు.

Read Also: Brahmanandam: నవ్వుకే నవ్వు పుట్టించిన ఘనుడు!

“నేను కామెడీ సినిమా చేస్తున్నాను, కామెడీ అంటే కామెడీ కింగ్ బ్రహ్మానందం ఉండాల్సిందే. మన ప్రతి ఇంట్లో ఉండే తాత క్యారెక్టర్ లో వీల్ చైర్ కే పరిమితం అయిన వరద అనే క్యారెక్టర్ లో బ్రహ్మానందంగారు నటిస్తున్నారు” అంటూ తరుణ్ భాస్కర్ అనౌన్స్ చేశాడు. ఒక పోస్టర్ ని కూడా రిలీజ్ చేస్తూ కీడా కోలా చిత్ర యూనిట్ నుంచి బ్రహ్మానందం గారికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాడు. “పేరు వరద-పోసేది పితుకంత” అంటూ బయటకి వచ్చిన ఈ పోస్టర్ లో బ్రహ్మీ కలర్ ఫుల్ గా భలే ఉన్నాడు. మరి ఈ పాన్ ఇండియా మూవీ బ్రహ్మీని మళ్లీ మనకి పూర్తి స్థాయి కామెడీ క్యారెక్టర్ లో చూపించి ఫుల్ మీల్స్ పెడుతుందేమో చూడాలి.

https://twitter.com/TharunBhasckerD/status/1620653791422062592

Exit mobile version