బీటౌన్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బాలీవుడ్ బిగ్ మూవీ “బ్రహ్మాస్త్ర పార్ట్-1 : శివ”. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రియల్ లైఫ్ లవ్ బర్డ్స్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా నటించగా, ఈ చిత్రం సెప్టెంబర్ 9న థియేటర్లలో విడుదల కానుంది. అయితే ప్రస్తుతం బీటౌన్ మొత్తం రణబీర్ కపూర్, అలియా భట్ పెళ్లి గురించే చర్చ నడుస్తోంది. ఏప్రిల్ 14న ఈ స్టార్ జంట పెళ్లి చేసుకోబోతున్న నేపథ్యంలో “బ్రహ్మాస్త్ర” దర్శకుడు స్పెషల్ గా విష్ చేశారు. “బ్రహ్మాస్త్ర” చిత్రం నుంచి ఓ ప్రత్యేకమైన వీడియోను విడుదల చేస్తూ రణబీర్, అలియాను శుభాకాంక్షలు చెప్పారు.
Read Also : Beast : విజయ్ కు ఫ్యాన్స్ కు షాక్… అక్కడ నో రిలీజ్ !
వారణాసిలోని అందమైన ప్రదేశాలలో చిత్రీకరించిన “కేసరియా” అనే మొదటి పాటకు సంబంధించిన చిన్న టీజర్ ను డైరెక్టర్ అయాన్ ముఖర్జీ విడుదల చేశారు. ఈ సాంగ్ విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. “రానున్న రోజుల్లో చాలా ప్రత్యేకమైన ప్రయాణాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్న మా ఈషా, శివల జీవితాల్లో ప్రేమ, అదృష్టం, వెలుగులు నిండాలని కోరుకుంటూ టీమ్ #బ్రహ్మాస్త్ర నుంచి ఈ విషెస్… ఏదైనా ప్రత్యేకతతో వేడుకను ప్రారంభిద్దాం” అంటూ ఈ వీడియోను పోస్ట్ చేశారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, ధర్మ ప్రొడక్షన్స్, ప్రైమ్ ఫోకస్, స్టార్‌లైట్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రంలో అమితాబ్ బచ్చన్, నాగార్జున అక్కినేని, మౌని రాయ్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
Wishing our Isha and Shiva all the Love, Luck and Light as they gear up to embark on a very special journey in the coming days ❤️
Let's kickstart the celebration with something special from Team Brahmāstra ✨#Brahmastra pic.twitter.com/KFqdZrrCR9— BRAHMĀSTRA (@BrahmastraFilm) April 13, 2022
