గ్లోబల్ మ్యూజిక్ ఐకాన్ టేలర్ స్విఫ్ట్ (Taylor Swift) జీవితాన్ని, ఆమె స్టార్‌డమ్ వెనుకున్న నిజాలను దగ్గరగా చూపించే ప్రత్యేక డాక్యుమెంటరీ సిరీస్ రాబోతోంది. “ది ఎండ్ ఆఫ్ ఎరా” (The End of an Era) పేరుతో రూపొందుతున్న ఈ సిరీస్ మొత్తం ఆరు ఎపిసోడ్‌లుగా విడుదల కానుంది. డిస్నీ+ ఓటీటీ వేదికపై డిసెంబర్ 13న అంటే టేలర్ పుట్టినరోజుకు ఒక రోజు ముందుగానే ప్రీమియర్ అవ్వడం స్విఫ్టీస్‌కు డబుల్ సెలబ్రేషనే. తాజాగా విడుదలైన ట్రైలర్‌లో టేలర్ కెరీర్‌లో ఎన్నడూ బయటకు రాని అనేక కోణాలను చూపించారు.
Also Read : Dulquer Salmaan: “నా మీద అలాంటి విమర్శలు ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి”
స్టేజ్‌పై ఎప్పుడూ కాన్ఫిడెంట్‌గా కనిపించే టేలర్, ఆ కాన్ఫిడెన్స్ వెనుక ఉన్న ఒత్తిడి, కష్టాలు, భారీ ప్రాక్టీస్‌లు, స్టాఫ్‌తో చేసే నిమిషానికో నిర్ణయం తీసుకోవాల్సిన ప్లానింగ్.. ఇవన్నీ రియలిస్టిక్‌గా చూపించారు. ఎరాస్ టూర్ కోసం ఆమె ఎలా ప్రిపేర్ అవుతుందో, ఒక్కో షో కోసం ఎంత ఎనర్జీ అవసరమవుతుందో చూడటం ఫ్యాన్స్‌కు ప్రత్యేక అనుభూతిని ఇచ్చింది. ట్రైలర్‌లో అత్యంత హృద్యంగా కనిపించినవి టేలర్ మరియు ఆమె తల్లి ఆండ్రియా స్విఫ్ట్ మధ్య ఉన్న భావోద్వేగ క్షణాలు. వారి బంధం, టేలర్ తీసుకునే నిర్ణయాలలో తల్లి అందించే మద్దతు ప్రేక్షకులను హత్తుకునేలా ఉన్నాయి. అలాగే, టేలర్ తన బాయ్‌ఫ్రెండ్ మరియు NFL స్టార్ ట్రావిస్ కెల్స్ గురించి కుటుంబంతో చర్చించే వ్యక్తిగత క్షణాలు కూడా చూపించారు.
అదంతా కాకుండా, టేలర్ సన్నిహితులు, సహకరించిన సింగర్లు సాబ్రినా కార్పెంటర్, ఎడ్ షీరన్ వంటి ప్రముఖుల బ్యాక్‌స్టేజ్ ఇంటరాక్షన్స్ మ్యూజిక్ లవర్స్‌ను మరింత ఎగ్జైట్ చేస్తున్నాయి. టూర్ సమయంలో జరిగిన ఫన్ మూమెంట్స్, వర్క్ ప్రెషర్, అంతర్గత సంఘర్షణలు ఇవి అన్నీ టేలర్ స్వయంగా తెలిపిన విధానం ఈ సిరీస్‌ను ఎంతో ప్రత్యేకంగా మార్చబోతుంది. మొత్తం మీద, టేలర్ ఇప్పటి వరకు చేసిన ప్రాజెక్ట్స్‌లోకెల్లా ఈ డాక్యుమెంటరీనే అత్యంత వ్యక్తిగతమైనది, అత్యంత లోతైనది అని అభిమానులు ఇప్పటికే కామెంట్స్‌లో చెబుతున్నారు. ట్రైలర్ రేంజ్ చూసి సిరీస్‌పై హైప్ మరింత పెరిగింది.
