బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ ప్రియదర్శన్- లిజి ముద్దుల కూతురు కళ్యాణి ప్రియదర్శన్ డిఫరెంట్‌గా బిహేవ్ చేస్తుంది. హలోతో టాలీవుడ్‌కు పరిచయమైన కళ్యాణి ప్రియదర్శన్ చిత్రలహరిలో కూడా డీసెంట్ క్యారెక్టర్‌తో ఆకట్టుకుంది. ఈ రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టడంతో తెలుగు చిత్రపరిశ్రమకు మరో స్టార్ హీరోయిన్ దొరికేసింది అనుకుంటున్న సమయంలో రణరంగం ఆమె టాలీవుడ్ కెరీర్ పైనే దెబ్బేసింది. హలొ, చిత్రలహరి హిట్స్ తర్వాత శర్వాతో చేసిన రణరంగం డిజాస్టర్ టాక్ రావడంతో మలయాళంకు వెళ్ళింది.
Also Read : Rajendra Prasad : హే ‘రాజేంద్ర ప్రసాద్’.. ఏ క్యా హువా
ఫస్ట్ మూవీ మరక్కార్ డిజాస్టర్ అయినప్పటికీ ‘హృదయం’తో కుర్రాళ్ల క్రష్ బ్యూటీగా మారిపోయింది. ఆ తర్వాత చేసిన బ్రో డాడీ, తాలుమల్ల, శేషం మైకెల్ ఫాతిమా, ఆంటోనీ, వర్షంగళక్కు శేషం సినిమాలు కళ్యాణిని మలయాళ ఇండస్ట్రీలో హై డిమాండ్ హీరోయిన్‌గా మార్చేశాయి. ఎట్ ప్రజెంట్ కళ్యాణి చేతిలో త్రీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళంలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోన్న జీనిలో నటిస్తోంది. రవి మోహన్ హీరో. కృతి శెట్టి మరో హీరోయిన్. అలాగే మలయాళంలో రెండు క్రేజీయెస్ట్ సినిమాలు చేస్తోంది. ఫహాద్ ఫజిల్ సరసన ఒడుం కుతిర చద్దాం కుతిరాతో పాటు దుల్కర్ సల్మాన్ బ్యానర్ వే ఫారర్ ఫిల్మ్స్ పతాకంపై మరో మూవీ చేస్తోంది. కాగా, తాజాగా మరో తమిళ ప్రాజెక్టుకు కమిటైనట్లు టాక్. కార్తీ 29లో ఈమెనే హీరోయిన్ అని చర్చ నడుస్తుంది. తానక్కరన్ ఫేం ‘తమిళ్’ దీనికి దర్శకుడు. ఈ సినిమా లాస్ట్ ఇయరే ఎనౌన్స్ చేయగా.. రీసెంట్లీ కళ్యాణీ ఫీమేల్ లీడ్‌గా సెలెక్ట్ అయినట్లు తెలుస్తోంది. మరీ ఇటు కోలీవుడ్, మాలీవుడ్ పై ఫోకస్ చేస్తూ ఆరేళ్లుగా టాలీవుడ్ ను మర్చిపోతున్న ఈ స్టార్ కిడ్ తనయ.. తెలుగు ప్రేక్షకులకు మళ్లీ ఎప్పుడు హాలో చెబుతుందో.