Site icon NTV Telugu

Taraka Ratna: FNCC కల్చరల్ క్లబ్ లో తారకరత్న ‘దశ దిన కర్మ’…

Taraka Ratna

Taraka Ratna

జనవరి 26న నారా లోకేష్ మొదలుపెట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న గుండెపోటుతో అక్కడే కుప్పకూలిపోయారు. కార్డియాక్ అరెస్ట్ కారణంగా 23 రోజుల పాటు మరణంతో పోరాడిన తారకరత్న, కోలుకోని ఆరోగ్యంగా తిరిగి వస్తారు అనుకుంటే నందమూరి అభిమానులని, తెలుగు దేశం పార్టీ కార్యకర్తలని, ఇండస్ట్రీ వర్గాలని శోకసంద్రంలోకి నెడుతూ ఫిబ్రవరి 18న తారకరత్న తుది శ్వాస విడిచారు. తారకరత్న మరణ వార్త ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరిచింది. తారకరత్న పుట్టిన రోజు నాడే, ఆయన ‘చిన్న కర్మ’ కార్యక్రమం జరిగింది. ఈరోజు తారకరత్న ‘పెద్దకర్మ’ ఫిల్మ్ నగర్ కల్చరల్ క్లబ్ లో జరుగుతోంది. చంద్రబాబు నాయుడు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, పురందరేశ్వరి, విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ నాయకులు, జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ తదితరులు తారకరత్న దశ దిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యారు.

Exit mobile version