NTV Telugu Site icon

Allu Arjun: అల్లు అర్జున్ పై కేజీఎఫ్ నటుడు కీలక వ్యాఖ్యలు

Allu Arjun (3)

Allu Arjun (3)

Tarak Ponnappa Crucial Comments on Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి కన్నడ నటుడు ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు. కేజిఎఫ్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించి తెలుగు ప్రేక్షకులకు కూడా నోటెడ్ అయ్యాడు కన్నడ నటుడు తారక్ పొన్నప్ప. ఆయన ఈ మధ్యకాలంలో పుష్ప సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఒక ఇంటర్వ్యూలో అల్లు అర్జున్తో వర్క్ ఎక్స్పీరియన్స్ గురించి ప్రశ్నిస్తే ఈ మేరకు ఆయన ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది. తనకు పుష్పా ది రూల్ సినిమాలో అల్లు అర్జున్తో కలిసి యాక్షన్ సీక్వెన్స్ ఉందని ఈ సందర్భంగా తారక్ పొన్నప్ప చెప్పుకొచ్చాడు. అయితే తనకు స్టంట్స్ చేయడంలో ఎక్కువ ఎక్స్పీరియన్స్ లేదని ఈ సందర్భంగా తారక్ పేర్కొన్నాడు.

Padma Bhushan Award: పద్మభూషణ్ అందుకున్న మిథున్ చక్రవర్తి, ఉషా ఉతుప్‌

నాకు స్టంట్స్ విషయంలో ఎక్స్పీరియన్స్ లేదనే విషయం తెలుసుకున్న అల్లు అర్జున్ బాడీ పొజిషనింగ్ విషయంలో నాకు సహాయం చేశాడు. ఆన్ స్క్రీన్ మీద ఎలా కనిపిస్తాం అనే విషయం మీద కూడా నాకు మెళకువలు నేర్పించారు అని చెప్పుకొచ్చాడు. డాన్స్ విషయంలో అలాగే స్టంట్స్ విషయంలో ఆయనకి ఉన్న జ్ఞానం చూసి నేను ఆశ్చర్యపోయాను అంటూ తారక్ పొన్నప్ప కామెంట్ చేశాడు. ఇక పుష్ప ది రూల్ సినిమా ఆగస్టు 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు తమిళ, కన్నడ , మలయాళం, హిందీ భాషలతో పాటు ఈసారి బెంగాలీ భాషలో కూడా సినిమాని రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సుకుమార్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇక అల్లు అర్జున్ గురించి తారక్ పొన్నప్ప చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Show comments