Tapsee Blurr Movie Directly Releasing On Zee5: టాలీవుడ్‌లో కెరియర్ మొదలుపెట్టి, బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్టేటస్ అందుకున్న బ్యూటీ ‘తాప్సీ’. కర్లీ హెయిర్‌తో క్యూట్‌గా కనిపించే తాప్సీ, కంటెంట్ ఉన్న సినిమాలనే ఆచితూచి ఎంపిక చేసుకుంటూ ఉంటుంది. ‘పింక్’, ‘ముల్క్’, ‘బద్లా’, ‘గేమ్ ఓవర్’ లాంటి సినిమాల్లో తన యాక్టింగ్ స్కిల్స్‌తో ఆడియన్స్‌ని మెస్మరైజ్ చేసిన తాప్సీ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘బ్లర్'(BLURR). తాప్సీ స్వయంగా ప్రొడ్యూస్ చేస్తున్న ఈ మూవీ, 2010లో రిలీజ్ అయిన ‘Julie’s Eyes’ అనే స్పానిష్ సినిమాకి అఫీషియల్ హిందీ రీమేక్. ‘సెక్షన్ 375’ లాంటి ఎక్స్పరిమెంటల్ సినిమాని డైరెక్ట్ చేసిన అజయ్ భల్ ‘బ్లర్’ మూవీని తెరకెక్కిస్తున్నాడు. తాప్సీతో పాటు గుల్షన్ కూడా నటిస్తున్న ఈ మూవీ షూటింగ్‌ని 2022 జూలైలో మొదలుపెట్టి, ఆగస్ట్ నెల అయిపోయేలోపు కంప్లీట్ చేశారు. కేవలం 70 వర్కింగ్ డేస్‌లో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాని మేకర్స్ ముందుగా థియేటర్స్‌లో రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇప్పుడు కాస్త వెనక్కి తగ్గి ఒటీటీ రిలీజ్‌కి వెళ్తున్నారు. ‘బ్లర్’ సినిమాని డిసెంబర్ 9న జీ5 విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్మెంట్ బయటకి వచ్చింది.
కంటికి కనిపించనిది ఏదో తనని వెంటాడుతూ ఉంటే, సారా అనే ఒక అంధురాలు ఉరి వేసుకోని చనిపోవడానికి కుర్చీ ఎక్కుతుంది. చనిపోవాలనే ఆలోచన విరమించుకోని కిందకి దిగుదాం అనుకునే సమయానికి సారా కాళ్ళ కింద ఉన్న కుర్చీని ఎవరో తన్నేస్తారు. దీంతో సారా చనిపోతుంది. దూరంగా ఎక్కడో ఉండే సారా యొక్క ట్విన్ సిస్టర్ జూలీకి… ‘హలో బ్రదర్’ సినిమాలో లాగా సారాకి ఏదో జరిగింది అనే విషయం అర్ధం అవుతుంది. ఇక్కడి నుంచి ఎండ్ వరకూ థ్రిల్లింగ్‌గా సాగే కథనంతో ‘Julie’s Eyes’ ఆడియన్స్ ని ఎడ్జ్ ఆఫ్ ది సీట్ కుర్చోబెడుతుంది. మరి ఇదే ఫీల్‌ని తాప్సీ అండ్ టీం కూడా క్యారీ చేశారో లేదో తెలియాలి అంటే డిసెంబర్ 9 వరకూ ఆగాల్సిందే.
