NTV Telugu Site icon

Tantra Teaser: వణికిస్తున్న తంత్ర టీజర్.. రక్త పిశాచాలు నిజంగానే ఉన్నాయా?

Tantra Movie Teaser

Tantra Movie Teaser

Tantra Movie Teaser Raising Expectations: మల్లేశం, వకీల్‌సాబ్ సినిమాలతో ప్రేక్షకులని మెస్మరైజ్ చేసిన తెలుగు హీరోయిన్ అనన్య నాగళ్ల ప్రధాన పాత్రలో నటించిన ‘తంత్ర ‘ మూవీ టీజర్ ను ఈ రోజు నటుడు ప్రియదర్శి రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. ‘ఊరిలో పుట్టిన దుష్టశక్తి రక్త దాహంతో విరుచుకుపడుతోంది..’ అంటూ చెబుతున్న డైలాగ్స్ మీద కట్ అయిన టీజర్ రకరకాల తాంత్రిక పూజలని చూపిస్తూ మైండ్-బ్లోయింగ్‌గా సాగింది. ఈ టీజర్‌ని బట్టి ఈ సినిమాలో మన పురాతన తాంత్రిక రహస్యాలను వెలికి తీస్తున్నట్లు అనిపిస్తోంది. అనన్య దుష్టశక్తి బారిన పడిన అమ్మాయిగా కొత్తగా కనిపిస్తుండగా ఇంతవరకు చూడని ఒక క్రేజీ రోల్ లో నటిస్తుందని మేకర్స్ చెబుతున్నారు. క్షుద్రపూజలు చేసే తాంత్రికుడిగా ‘టెంపర్ వంశీ’ లుక్ కూడా బాగా సెట్ అయ్యింది, సలోని పాత్ర అయితే మిస్టీరియస్‌గా కనపడుతోంది.

Hi Nanna Vs Extra Ordinary Man: హాయ్ నాన్న- ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్.. సినిమాలు ఎలా ఉన్నాయంటే?

ప్రస్తుతం హర్రర్ ట్రెండ్ నడుస్తోంది, క్షుద్రపూజలు ఇతివృత్తంగా వస్తున్న సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్స్ కొడుతున్న టైమ్‌లో వస్తున్న ఈ మూవీ కూడా ప్రామిసింగ్‌గా కనపడుతోంది. శ్రీహరి తమ్ముడి కొడుకు ధనుష్ రఘుముద్రి ఈ మూవీతో హీరోగా పరిచయమవుతున్నాడు. సలోని ఈ సినిమాతో గట్టిగా రీ-ఎంట్రీ ఇస్తోంది. రీసెంట్‌గా మంగళవారం సినిమాతో ఆకట్టుకున్న మీసాల లక్ష్మణ్ ఈ సినిమాలో ఒక మంచి రోల్ చేశారు. ఫస్ట్ కాపీ మూవీస్, బి ద వే ఫిల్మ్స్ బ్యానర్స్ కలిసి రూపొందించిన ఈ సినిమా ఫస్ట్‌లుక్‌కి ఇప్పటికే మంచి రెస్పాన్స్ వచ్చింది. వాల్ట్‌డిస్నీలో పనిచేసిన శ్రీనివాస్ గోపిశెట్టి ఈ మూవీతో దర్శకుడిగా డెబ్యూ చేస్తున్నారు. టీజర్ చూసి ఇంప్రెస్ అయిన ప్రియదర్శి దీనిని లాంచ్ చేయడానికి ముందుకొచ్చారని మేకర్స్ వెల్లడించారు.