Tamizha Vetri Kazhagam Party announced by Actor Vijay: తమిళ స్టార్ హీరో విజయ్ రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తాడన్న ఉత్కంఠకు ఎట్టకేలకు ఈ రోజు సమాధానం దొరికింది. ఢిల్లీ వెళ్లి భారత ఎన్నికల సంఘం వద్ద పార్టీ పేరు నమోదు చేసుకున్నారు హీరో విజయ్. ఇక సంబంధిత పత్రాలను ఆన్‌లైన్‌లో కూడా షేర్ చేశారు. అంతేకాదు టీవీకే విజయ్ పేరిట ప్రత్యేక సోషల్ మీడియా ఖాతాలు ప్రారంభమయ్యాయి. మొదటిసారిగా ఒక నివేదిక ప్రచురించబడింది. తమిళనాడు వెట్రి కజగం పేరుతో రాసిన లేఖలో ప్రియమైన తమిళనాడు ప్రజలందరికీ నా వినయపూర్వకమైన నమస్కారాలు.”విజయ్ పీపుల్స్ మూవ్‌మెంట్” అనేక సంవత్సరాలుగా తన శక్తి మేరకు అనేక సంక్షేమ పథకాలు, సామాజిక సేవలు మరియు సహాయ సహకారాలు చేస్తున్న సంగతి మీ అందరికీ తెలిసిందే. అయితే, ఒక స్వచ్ఛంద సంస్థ మాత్రమే పూర్తి సామాజిక, ఆర్థిక మరియు రాజకీయ సంస్కరణలు తీసుకు రావడం అసాధ్యం, దానికి రాజకీయ అధికారం కావాలి.
Rakul Preet Singh : రెడ్ కలర్ డ్రెస్సులో హాట్ మిర్చీలా రకుల్ స్టన్నింగ్ పోజులు..
ప్రస్తుత రాజకీయ వాతావరణం మీ అందరికీ తెలిసిందే. ఒకవైపు పాలనాపరమైన దురాచారాలు, “అవినీతి రాజకీయ సంస్కృతి”, మరోవైపు మన ప్రజలను కుల, మతాల వారీగా విభజించేందుకు ప్రయత్నిస్తున్న “విభజన రాజకీయ సంస్కృతి” మన ఐక్యతకు, ప్రగతికి అడ్డంకులుగా ఉన్నాయి. నిస్వార్థ, పారదర్శక, కుల రహిత, దార్శనికత, అవినీతి రహిత సమర్ధవంతమైన పరిపాలనకు దారితీసే మౌలికమైన రాజకీయ మార్పు కోసం ముఖ్యంగా తమిళనాడులో ప్రతి ఒక్కరూ తహతహలాడుతున్నారనేది వాస్తవం అని అన్నారు. మరీ ముఖ్యంగా, తమిళనాడు రాష్ట్ర హక్కులపై ఆధారపడిన మన భారత రాజ్యాంగానికి లోబడి ఇటువంటి రాజకీయాలు ఉండాలి, ఈ భూమికి “బిర్బోకోమ్ ఎల్లా బియొక్కుమ్” (పుట్టుకతో అందరూ సమానమే) అనే సమానత్వ సూత్రంపై ఆధారపడి ఉండాలని పేర్కొన్నారు. ఇటువంటి మౌలికమైన రాజకీయ మార్పు ప్రజల ఏకగ్రీవ అభిమానం మరియు ప్రేమ కలిగిన ప్రజాశక్తి ద్వారా మాత్రమే సాధ్యమవుతుందని అందుకే టీవీకే తమిళనాడు వెట్రి కజగం పార్టీతో ప్రజల్లోకి వస్తున్నామని పేర్కొన్నారు.