NTV Telugu Site icon

Bamba Bakya: చిత్ర పరిశ్రమలో విషాదం.. ‘పొన్నియన్ సెల్వన్’ సింగర్ మృతి

Bamba Bakya

Bamba Bakya

Bamba Bakya: చిత్ర పరిశ్రమలో విషాదం చోటుచేసుకొంది. ప్రముఖ కోలీవుడ్ సింగర్ బాంబా బాక్య అనుమాస్పదంగా మృతి చెందారు. రజినీ కాంత్ – శంకర్ కాంబోలో వచ్చిన రోబో 2.ఓ చిత్రంలోని బుల్లిగవ్వ సాంగ్ ను తమిళ్ వెర్షన్ లో బాంబా బాక్య ఆలపించారు. ఈ సాంగ్ ఫేమస్ అయ్యిన ఆయన ఆ తరవాత విజయ్ నటించిన సర్కార్ తో పాటు మరికొన్ని సినిమాలో హిట్ సాంగ్స్ అందించారు. ఇక విడుదలకు సిద్ధంగా ఉన్న పొన్నియన్ సెల్వన్ చిత్రంలోని పొన్నినది సాంగ్ ను పాడింది కూడా బాంబా బాక్యనే.

శుక్రవారం ఉదయం ఆయన గుండెపోటుతో మరణించారని ఆయన కుటుంబ సభ్యులు తెలుపుతున్నారు. అయితే అందులో నిజం ఎంత అనేది తెలియాల్సి ఉంది. ఇక బాంబా బాక్య మృతితో కోలీవుడ్ లో విషాద ఛాయలు అలముకున్నాయి. ఈ ఆయన మరణ వార్త విన్న పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. హీరో కార్తీ ట్విట్టర్ వేదికగా బాంబా బాక్యకు సంతాపం వ్యక్తం చేశారు. ” బాంబా బాక్య ఆకస్మిక మరణం ఎంతో బాధ కలిగించింది. ఆయన మృతిని తట్టుకొని నిలబడగలిగే శక్తిని వారి కుటుంబ సభ్యులకు దేవుడు ఇవ్వాలని ప్రార్థిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది.

Show comments