Tamil Film Producer Jaffer Sadiq Arrested in 2000 Crore Drug Smuggling Case: రూ.2000 కోట్ల విలువైన డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో తమిళ సినీ నిర్మాత ఒకరు అరెస్ట్ అయ్యారు. కొద్ది రోజుల క్రితం ఢిల్లీలో సెంట్రల్ నార్కోటిక్స్ విభాగం పోలీసులు జరిపిన దాడిలో కోట్ల విలువైన నిషేధిత డ్రగ్స్ దొరికాయి. దీనికి సంబంధించి చెన్నైకి చెందిన ముఖేష్, ముజీపూర్, విల్లుపురం అశోకుమార్‌లను అరెస్టు చేశారు. వారి నుంచి డ్రగ్స్ తయారీకి ఉపయోగించే 50 కిలోల రసాయనాలను స్వాధీనం సైతం చేసుకున్నారు. వాటి అంతర్జాతీయ విలువ రూ.2,000 కోట్లు. ఇక ఈ కేసులో తమిళ సినీ నిర్మాత, డీఎంకే చెన్నై వెస్ట్ జిల్లా కమిటీ డిప్యూటీ ఆర్గనైజర్ జాఫర్ సాదిక్ హస్తం కూడా ఉందని అసలు ఆయనే సూత్రధారి అని ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఈ ఆరోపణల తర్వాత డీఎంకే నుంచి శాశ్వతంగా బహిష్కరణకు గురయ్యారు. చెన్నై మైలాపూర్ అరులానందం స్ట్రీట్‌లోని ఆయన ఇంటికి వెళ్లిన సెంట్రల్ నార్కోటిక్స్ కంట్రోల్ యూనిట్ అధికారులు జాఫర్ సాదిక్ వ్యక్తిగతంగా హాజరు కావాలని నోటీసును అతికించారు. ఇదే విషయంపై NCB డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (ఆపరేషన్స్) జ్ఞానేశ్వర్ సింగ్ మాట్లాడుతూ, సాదిక్ అరెస్టును ధృవీకరించారు.
Nagababu: సేనా..సిద్దం సిద్దం అన్నోళ్ళకి ఈసారి యిద్దాం మర్చిపోలేని యుద్ధం!
అతను భారతదేశం-ఆస్ట్రేలియా-న్యూజిలాండ్ మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌కు “కింగ్‌పిన్” అని పేర్కొన్నారు. అయితే గత ఫిబ్రవరి 28న జాఫర్ సాదిక్ హాజరు కావాల్సి ఉండగా.. అప్పటి నుంచి కనిపించకుండా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో జైపూర్‌లో పరారీలో ఉన్న జాఫర్ సాదిక్‌ను అరెస్టు చేసినట్లు ఎన్‌సీపీ అధికారులు ధృవీకరించారు. ఇక ప్రస్తుతం ఎన్సీపీ అధికారులు అతడిని ముమ్మరంగా విచారిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా, తమిళనాడు సినీ పరిశ్రమ ప్రముఖులకు కూడా డ్రగ్స్ రవాణా చేస్తున్నట్టు జాఫర్ సాదిక్ అంగీకరించినట్లు ఎన్‌సీపీ అధికారి ఒకరు వెల్లడించారు. జాఫర్ సాదిక్ తమిళనాడు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులతో టచ్‌లో ఉన్నట్లు కూడా వాంగ్మూలం ఇచ్చారని, విచారణ అనంతరం జాఫర్ సాదిక్‌కు రాజకీయాలు, చిత్ర పరిశ్రమ, నిర్మాణ రంగాల్లోని ముఖ్యాంశాలతో సంబంధం ఉన్నట్లు సమాచారం. డ్రగ్స్ అక్రమ రవాణాకు పాల్పడుతున్న సినీ ప్రముఖుల పేర్లు బయటపెట్టినట్టు తెలుస్తోంది. జాఫర్ సాదిక్‌కి బాలీవుడ్ సినీ పరిశ్రమతో కూడా లింక్ ఉందని ఈ కోణంలో కూడా విచారణ కొనసాగుతోందని చెప్పారు.
