Rangaraj : తమిళంలో భారీ ట్విస్ట్ నెలకొంది. ఓ నటుడు చేసిన పని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. నటుడు, చెఫ్ అయిన రంగరాజ్ జూలై 26న సెలబ్రిటీ స్టైలిష్ట్ అయిన జాయ్ క్రిసిల్డానీని రెండో పెళ్లి చేసుకున్నాడు. రంగరాజ్ కు గతంలోనే పెళ్లి అయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అయినా సరే జాయ్ ను రెండో పెళ్లి చేసుకున్నాడు. ట్విస్ట్ ఏంటంటే వీరిద్దరూ పెళ్లి చేసుకునే టైమ్ కు జాయ్ ఆరు నెలల గర్భిణి. ఈ విషయాన్ని జాయ్ స్వయంగా తెలిపింది. పది రోజుల కిందటి వరకు వీరిద్దరూ ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఏమైందో తెలియదు.. సడెన్ గా జాయ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Read Also : Rajini Kanth : రజినీకాంత్ తో వివాదంపై స్పందించిన సత్యరాజ్
తన భర్త రంగరాజ్ తనను పెళ్లి చేసుకున్నాడు గానీ.. పట్టించుకోవట్లేదని ఎమోషనల్ అయింది. రంగరాజ్ తన ఫస్ట్ వైఫ్ తోనే ఉంటున్నాడంట. రీసెంట్ గా ఫస్ట్ వైఫ్, పిల్లలతో కలిసి ఓ ఫంక్షన్ లో కనిపించాడు. జాయ్ కంప్లయింట్ తో రంరాజ్ మీద కేసు నమోదైంది. తనను పట్టించుకోకపోవడంపై నిలదీయగా.. రంగరాజ్ తన మీద దాడి చేశాడంటూ పేర్కొంది. అయితే ఆమె ప్రెగ్నెంట్ కు కారణం రంగరాజా కాదా అన్నదానిపై రకరకాల రూమర్లు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని రంగరాజ్ మాత్రం ఇప్పటి వరకు ప్రకటించలేదు. ఏదేమైనా వీరిద్దరి వ్యవహారం ఇప్పుడు కోలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. రంగరాజ్ చాలా సినిమాల్లో నటించాడు. టీవీ షోలకు జడ్జిగా వ్యవహరించాడు.
Read Also : Bachelor Heros : 40 ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోని హీరోలు
