Tamannaah : స్టార్ హీరోయిన్ తమన్నా వరుస వెబ్ సిరీస్ లు, సినిమాలతో దూసుకుపోతోంది. ఎలాంటి బోల్డ్ సీన్లు చేయడానికైనా రెడీ అంటోంది ఈ బ్యూటీ. తాజాగా ఆమె నటించిన ‘డు యూ వనా పార్ట్‌నర్’ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయింది. ఇందులో తమన్నా, బాలీవుడ్ నటి డయానా పెంటి మెయిన్ లీడ్ లో నటిస్తున్నారు. కాలిన్, అర్చిత్‌కుమార్ ఈ వెబ్ సిరీస్‌కు సంయుక్తంగా దర్శకత్వం చేయగా.. ఓటీటీ సంస్థ ‘అమెజాన్ ప్రైమ్ దీన్ని నిర్మిస్తోంది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సిరీస్ ట్రైలర్ ను తాజాగా రిలీజ్ చేశారు.
Read Also : Prabhas : వార్-2ను దెబ్బ కొట్టిన కూలీ.. ప్రభాస్ రివేంజ్ తీరుస్తాడా..?
కార్పొరేట్ జాబులు చేసి విసుగు పుట్టిన ఇద్దరు ఫ్రెండ్స్ జాబ్ మానేస్తారు. ఆ తర్వాత బీర్ ను సొంతంగా తయారు చేసి బిజినెస్ చేయాలనుకుంటారు. ఈ క్రమంలో వారికి ఎదురైన అనుభవాలు ఎలాంటివి అనే నేపథ్యంలో ఈ సిరీస్ ను తీశారు. ట్రైలర్ లో తమన్నా చెప్పిన.. ‘బీర్ అనేది ఒక ఎమోషన్’ అనే డైలాగ్ ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ థ్రిల్లర్ సస్పెన్స్ తో పాటు కామెడీగా ఉంటుందని ట్రైలర్ చూస్తే తెలిసిపోతోంది. ఈ ట్రైలర్ లో తమన్నా చెప్పిన కొన్ని బోల్డ్ డైలాగులు కూడా ఉన్నాయి. మరి ఓటీటీలో ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి.
Read Also : Tollywood : ప్లాపుల్లో టాలీవుడ్.. ఆ ముగ్గురు ఆదుకుంటారా..?
