Tamannaah Bhatia’s stunning red corset saree with modern drape Setting Internet on Fire: బాంబే భామ అయినా తమన్నా తెలుగు, తమిళ సినిమాలలోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకుంది. ఇక్కడ సినిమా అవకాశాలు తగ్గడంతో స్పెషల్ సాంగ్స్ కి ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఇప్పుడు అవే స్పెషల్ సాంగ్స్ అవకాశాలు ఆమెకు బాలీవుడ్ లో కూడా వస్తున్నాయి. అందులో భాగంగానే స్త్రీ 2 అనే సినిమాలో ఆమె ఒక స్పెషల్ సాంగ్ చేసింది. దాన్ని తాజాగా రిలీజ్ చేశారు.
ఆ సాంగ్ బాలీవుడ్ శ్రోతలను విపరీతంగా ఆకట్టుకుంటుంది. ఇక ఈ స్పెషల్ సాంగ్ లో ఆమె ధరించిన కాస్ట్యూమ్ తో ఉన్న పలు ఫొటోలను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆమె ధరించిన చీర కాస్ట్ ఎంత అని కూడా కొందరు లేడీ ఫ్యాన్స్ సెర్చ్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఉన్న సమాచారం మేరకు ఆమె ధరించిన చీర టొరాని ఇండియా అనే బ్రాండ్ నుంచి వచ్చింది.
దాని ధర 79,500. ఇక ఆమె ధరించిన కార్సెట్ బ్లౌజ్ ధర 46,500 మొత్తంగా ఆమె ఆ సాంగ్ కోసం ధరించిన ఔట్ ఫిట్ ఖరీదు లక్ష 26,000.
ఇక ఆమె గులాబీని ముద్దాడుతూ కొన్ని ఫోటోలు అలాగే తెరచాటున తొంగిచూస్తూ కొన్ని ఫోటోలకు ఫోజులిచ్చింది. దీంతో ఆమె అభిమానులు రకరకాల కామెంట్లు చేస్తూ రెచ్చిపోతున్నారు.
కొందరైతే గులాబీయే గులాబీని ముద్దాడితే తట్టుకోవడం ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒక లుక్కేయండి.
Tamannah: గులాబీయే గులాబీని ముద్దాడితే తట్టుకోడం ఎలా తమన్నా?

Tamannahthumb