Site icon NTV Telugu

Babli Bouncer: చివరి షెడ్యూల్ లో మిల్కీ బ్యూటీ హిందీ సినిమా!

Babli 1

Babli 1

మిల్కీ బ్యూటీ తమన్నా ప్రస్తుతం తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. ‘ఎఫ్ 3’ మూవీ షూటింగ్ పూర్తయ్యి విడుదలకు సిద్ధం కాగా, ‘గుర్తుందా శీతాకాలం’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా నటిస్తున్న ‘భోళా శంకర్’సెట్స్ పై ఉంది. అలానే ఈ అందాల చిన్నది హిందీలోనూ మూడు చిత్రాలలో నటిస్తోంది. ‘బోలే చుడియా’ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటోంది.

 

అలానే ‘ప్లాన్ ఎ ప్లాన్ బి’ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇక మూడో సినిమా ‘బబ్లీ బౌన్సర్’ సైతం చివరి దశకు చేరుకుంది. ఈ విషయాన్ని తమన్నా తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపింది. మధుర్ భండార్కర్ దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో నటించడం ఓ ట్రీట్ లాంటిదని తమన్నా చెబుతోంది. మూడోది, చివరిదైన షెడ్యూల్ మొదలు కాగానే తనకిష్టమైన ముంబై వడాపావ్ ను మధుర్ భండార్కర్ తో షేర్ చేసుకుంటున్న ఫోటోనూ తమన్నా పోస్ట్ చేసింది. ఇదే విషయాన్ని మధుర్ భండార్కర్ సైతం తెలిపాడు. మూడో షెడ్యూల్ మొదటి రోజు తమన్నాతో కలిసి వడాపావ్ ను షేర్ చేసుకున్నానని చెప్పాడు. ఉమెన్ సెంట్రిక్ మూవీస్ తీయడంతో తనదైన మార్క్ ను చూపించే మధుర్ భండార్కర్ మరి మిల్కీ బ్యూటీని ఎలా తెరపై చూపిస్తాడో చూడాలి!

Exit mobile version