మిల్కీబ్యూటీ తమన్నా అబ్బాయిలా మారిపోయింది.. హాట్ హాట్ డ్రెస్ ల్లో దర్శనమిచ్చే భామ సడెన్ గా ప్యాంటు షర్ట్ వేసింది.. మూతికి మీసం వచ్చేసింది.. ఇక షాకింగ్ ట్రాన్సపర్మేషన్ కి ఫ్యాన్స్ అవాక్కవుతున్నారు. హాట్ బ్యూటీ తమన్నా ఏంటీ ఇలా మారిపోయింది అంటూ షాక్ అవుతున్నారు. అయితే ఇదంతా సినిమా కోసమే అని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఇటీవల తమన్నా నటించిన ఎఫ్ 3 చిత్రం విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసుకున్న విషయం విదితమే. ఇక ఈ చొత్రంలో రకరకాల వేషధారణలో తమన్నా కనిపించిన విషయం తెలిసిందే. అందులో ఈ అబ్బాయి గెటప్ ఒకటి.. ఇక తాజాగా ఈ బ్యూటీ అబ్బాయి, అమ్మాయి గెటప్ లో కనిపించి ఔరా అనిపించింది.
ఇన్స్టా రీల్స్ లో భాగంగా అమ్మడు ఇలాంటి వీడియో ఒకటి చేసి నెట్టింట అభిమానులకు షేర్ చేసింది, అందులో గుమ్మం వెనుక నిలబడి డోర్స్ క్లోజ్ చేయగానే చీర కట్టులో ఎంతో అందంగా కనిపిస్తుంది. ఆ క్షణమే మళ్లీ అబ్బాయి గా ప్యాంట్..టీషర్ట్..మీసాలు..హెయిర్ స్టైల్ తో అచ్చంగా అబ్బాయిలా మారిపోతుంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం తమన్నా `గుర్తుందా శీతాకాలం’ చిత్రంలో సత్యదేవ్ సరసన నటిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి నటిస్తోన్న `భోళా శంకర్` లోనూ తమన్నాని తీసుకున్నారు. `దటీజ్ మహాలక్ష్మి` లో నటించింది. కానీ ఆ ప్రాజెక్ట్ రిలీజ్ కి నోచుకోలేదు. ఇక బాలీవుడ్ లో `బోల్ చుడాయాన్`.. `ప్లాన్ ఏ ప్లాన్ బి`..`బాబ్లీ బౌన్సర్` లో నటిస్తోంది.
