Site icon NTV Telugu

Tamannaah Bhatia : సముద్రపు ఒడ్డున మిల్కీ బ్యూటీ హొయలు… వీడియో వైరల్

Tamannah

మిల్కీ బ్యూటీ తమన్నా తాజాగా బీచ్ ఒడ్డున వెకేషన్ ను ఎంజాయ్ చేస్తోంది. అందమైన మాల్దీవుల్లో హొయలు పోతూ ఆమె షేర్ చేసిన బికినీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్నా ఫ్లోరల్ కేప్‌తో పింక్ కలర్ బికినిలో ఉండగా… ఆమె బోల్డ్ లుక్‌ని చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఇక వీడియోతో పాటు తమన్నా ఐస్ క్రీం సైకిల్ తొక్కుతున్న చిత్రాన్ని కూడా పంచుకున్నారు. ఆ పిక్ లో తమన్నా పింక్ క్రాప్ టాప్ , డెనిమ్ షార్ట్‌లను ధరించి కనిపించింది.

Read Also : RRR Pre Release Event : గెస్ట్ గా కర్ణాటక సీఎం ఎందుకొచ్చారంటే ?

కాగా తమన్నా ఇటీవల “గుర్తుందా శీతాకాలం” సినిమాతో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. మరోవైపు తమన్నా ఇటీవలే “బబ్లీ బౌన్సర్” మొదటి షెడ్యూల్‌ను ముగించింది. ఈ ప్రాజెక్టుకు మధుర్ భండార్కర్ దర్శకత్వం వహిస్తున్నారు. అంతేకాకుండా F3, భోళా శంకర్ వంటి కొన్ని క్రేజీ ప్రాజెక్ట్‌లు ఆమె కిట్టీలో ఉన్నాయి.

Exit mobile version