Site icon NTV Telugu

తమన్నా కొత్త ఛాలెంజ్… ఇట్స్ యువర్ టర్న్

Tamannah

మిల్కీ బ్యూటీ తమన్నా అభిమానులకు కొత్త ఛాలెంజ్ విసిరింది. ఇట్స్ యువర్ టర్న్ అంటూ సోషల్ మీడియాలో ఓ వీడియోతో అందరినీ ఉత్సాహ పరుస్తోంది. ఈ బ్యూటీ “గని” చిత్రంలోని ‘కొడ్తే’ అనే స్పెషల్ సాంగ్ చేసిన విషయం తెలిసిందే. జనవరి 16న విడుదలైన ఈ సాంగ్ లో తమన్నా భాటియా చేసిన ప్రత్యేక డ్యాన్స్ ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ‘కొడ్తే’ సాంగ్ ఫీవర్‌ని మరో మెట్టు ఎక్కిస్తూ పెప్పీ సాంగ్ స్టెప్ ను వేయమంటూ అందరినీ ఆహ్వానించింది. ఇన్‌స్టాగ్రామ్‌లో తమన్నా “మరిన్ని అవకాశాలను తీసుకోండి. మరిన్ని నృత్యాలు చేయండి. నేను #కొడ్తే బీట్‌కి డ్యాన్స్ చేస్తున్నాను. ఇది మీ వంతు! ” అంటూ ఆ సాంగ్ కు స్టెప్ప్పులేస్తున్న వీడియోను షేర్ చేసింది. అందులో తమన్నా నల్లటి క్రాప్ టాప్, బ్యాగీ బ్లాక్ ప్యాంటు ధరించింది.

Read Also : “ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 10″లో ఆక్వామ్యాన్… క్రేజీ రోల్

వరుణ్ తేజ్ బాక్సర్‌గా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా “గని”. ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. వరుణ్ తేజ్‌తో పాటు ఈ ప్రాజెక్ట్‌లో సాయి మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి, నవీన్ చంద్ర కూడా నటించారు. ఈ స్పోర్ట్స్ బేస్డ్ మూవీ మార్చి 18న థియేటర్లలోకి రానుంది. ప్రముఖ స్వరకర్త ఎస్ థమన్ ‘గని’కి సంగీతం అందించగా, జార్జ్ సి. విలియమ్స్ ప్రాజెక్ట్ సినిమాటోగ్రఫీని చూసుకున్నారు. కాగా కొడ్తేలో తమ ఎలక్ట్రిఫైయింగ్ కెమిస్ట్రీని చూపించిన తర్వాత వరుణ్ తేజ్, తమన్నా “ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్” ఫ్రాంచైజీ “F3″లో స్క్రీన్ స్పేస్‌ను పంచుకోనున్నారు.

View this post on Instagram

A post shared by Tamannaah Bhatia (@tamannaahspeaks)

Exit mobile version